టికెట్ విషయంలో సీఎం ను కలిసిన మేకపాటి రాజమోహన్‌ రెడ్డి

By -  Nellutla Kavitha |  Published on  28 April 2022 2:36 PM GMT
టికెట్ విషయంలో సీఎం ను కలిసిన మేకపాటి రాజమోహన్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి కలిసారు. తమ కుమారుడు, మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరు నుండి తన మరో కుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని సీయంను కోరారు మేకపాటి రాజమోహన్ రెడ్డి.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు రాజమోహన్ రెడ్డి. తాను, తన కుటుంబం మొదటి నుండి సీఎం వై ఎస్ జగన్ తోనే నడుస్తున్నామని, గతంలో పెద్ద కుమారుడు గౌతమ్ రెడ్డిని పార్టీలోకి తెచ్చినా, గౌతమ్ రెడ్డి అకస్మాత్తుగా మరణించడంతో, రెండో కుమారుడు విక్రమ్ రెడ్డిని తీసుకొస్తున్నానని అన్నారాయన. త్వరలో ఆత్మకూరులో పార్టీ సమావేశాలు నిర్వహిస్తామని, నిరంతరం ప్రజల్లో ఉండాలని సీఎం సూచించారని రాజమోహన్ రెడ్డి చెప్పారు. విక్రమ్ కూడా గౌతమ్ లాగానే సీఎం జగన్ తో పయనిస్తారన్న నమ్మకం ఉందని అన్నారు.

ఇక గతంలో బిజినెస్ మాత్రమే తాను చూసుకునే వాడినని, అన్నయ్య మరణం తో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని, సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలపడానికి వచ్చామని అన్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి.తమ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు సీఎం జగన్ అండగా ఉన్నారని, ఈరోజు తనను సీఎం జగన్ ఆశీర్వదించారని, ఆయన చెప్పిన మార్గంలో, నాన్న, అన్న లాలనే జగన్ అన్న తో నడుస్తానన్నారాయన.

గతంలోనే ఇదే ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఉపఎన్నికల బరిలోకి దిగడానికి దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి భార్య కీర్తి రెడ్డి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. కొందరు పార్టీ పెద్దల అండదండలు ఉన్నట్టుగా కూడా వినిపించింది. అయితే మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటుగా, ఇతర కుటుంబసభ్యులు అందుకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా ప్రచారం జరిగింది.

Next Story