ట్రంప్ వెళ్ళిపోయాడు.. బీజేపీ ప్రభుత్వం కూడా వెళ్లిపోవడం ఖాయం

Mehabooba Mufti Comments On BJP. జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర విమర్శలు

By Medi Samrat  Published on  9 Nov 2020 2:15 PM GMT
ట్రంప్ వెళ్ళిపోయాడు.. బీజేపీ ప్రభుత్వం కూడా వెళ్లిపోవడం ఖాయం

జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ను ఇంటికి పంపించినట్లుగానే బీజేపీని కూడా ప్రజలు ఇంటిబాట పట్టిస్తారని ఆమె అన్నారు. అమెరికాలో ఏం జరిగిందో బీజేపీకీ కూడా అదే గతి పడుతుందని సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు.

జమ్ము కశ్మీర్‌లో భూముల కొనుగోలుకు భారతీయులందరినీ అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. జమ్ము కశ్మీర్‌ను బీజేపీ అమ్మకానికి పెట్టిందని.. జమ్ము కశ్మీర్‌లో యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వారు ఆయుధాలు చేతబడుతున్నారని ఆమె అన్నారు. త్రివర్ణ పతాకం కోసం వేలాది మంది ప్రాణాలొడ్డుతున్నారని, భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య శాంతికి జమ్ముకశ్మీర్‌ వారథిగా మారాలని ఆకాంక్షించారు.

ఆర్టికల్‌ 370 హిందువులు లేదా ముస్లింలకు సంబంధించిన అంశం కాదని, ఇది జమ్ము కశ్మీర్‌ స్వతంత్రతకు చిహ్నంగా చూడాలని అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో ప్రజలు వారి భవిష్యత్‌ పట్ల ఆందోళన చెందుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. బిహార్‌ ఎన్నికల్లో మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ చీఫ్‌ తేజస్వి యాదవ్‌పై మెహబూబా ముఫ్తీ ప్రశంసలు కురిపించారు.


Next Story