ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ.. 16 ఏళ్ల బాలుడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. కొన్ని ప్రమాదకర గేమ్స్ ఉంటాయి.

By Srikanth Gundamalla  Published on  30 July 2024 3:30 AM GMT
Maharashtra, 16 years boy, online games, suicide,

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ.. 16 ఏళ్ల బాలుడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య 

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. కొన్ని ప్రమాదకర గేమ్స్ ఉంటాయి. వీటి వల్ల ఇప్పటికే కొందరు పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా మహారాష్ట్రలో కూడా ఓ 16 ఏళ్ల బాలుడు 14వ అంతస్తు భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. అతను ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసయ్యాడని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని సూసైడ్ చేసుకున్నాడని చెబుతున్నారు.

బాలుడు మల్లీప్టేయర్‌ గేమ్స్‌ ఆడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. అతని నోట్‌ బుక్‌లో మ్యాప్‌తో కూడిన లాగ్‌ అవుట్‌ నోట్‌ ను గుర్తించారు. ఇదొక్కటే కాదు.. అనేక స్కెచ్‌లు, మ్యాప్‌లను పోలీసులు గుర్తించారు. ఇక ల్యాప్‌టాప్‌లో గేమ్స్‌గురించి ఆరా తీయడానికి ప్రయత్నించారు. కానీ పాస్‌వర్డ్‌ తెలియకపోవడంతో ఓపెన్ చేయలేకపోయారు. దాన్ని సైబర్‌ నిపుణుల వద్దకు పంపామని పింప్రి-చించ్‌వాడ్‌ పోలీసులు తెలిపారు.

ఈ మేరకు బాలుడి తల్లి మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా తన కొడుకు ప్రవర్తనలో మార్పులు చూసినట్లు పేర్కొంది. తన కుమారుడిలో అసాధారణ ప్రవర్తనను గనమిచంఆనని చెప్పింది. అప్పుడప్పుడు కత్తి, నిప్పుతో ఆటలు ఆడటం వంటివి చేశాడని తెలిపింది. హానికరమైన వెబ్‌సైట్లను ల్యాప్‌టాప్‌లో ఉపయోగించినందు వల్లే ఈ సంఘటన జరిగిందంటూ బాలుడి తల్లి ఆవేదన చెందింది. ఈ మేరకు ఇలాంటి డిజిటల్ కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.

ల్యాప్‌టాప్‌కు పేరెంట్‌ లాక్ ఉంచామనీ.. కానీ తమ కుమారుడు దాన్ని దాటవేశాడని అతని తండ్రి చెప్పాడు. చదువుల్లో ముందేవాడు కానీ గేమ్స్‌కు బానిస కావడంతో మొత్తం చెడిపోయిందన్నాడు. ఆన్‌లైన్‌ కార్యకలాపాలను తమ వద్ద దాచేవాడని ఆయన పేర్కొన్నాడు. నోట్‌బుక్‌లో 'బ్లూవేల్‌ గేమ్‌' ను పోలిన డ్రాయింగ్స్‌ గుర్తించామన్నాడు. ఈ గేమ్‌ ఆడినవారు ఇప్పటికే పలువురు విద్యార్తులు సూసైడ్ చేసుకున్నారు. ఇందులో ఆడించేవారు ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహిస్తారు. ఆన్‌లైన్ గేమ్ బాలుడిపై ప్రభావం గురించి మరిన్ని వివరాలను వెలికితీసేందుకు సైబర్ నిపుణుల సహాయంతో పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

బ్లూవేల్‌ గేమ్‌:

బ్లూవేల్‌ గేమ్‌ రష్యాకు చెందినది. ఈ గేమ్‌ సుమారు 50 రోజుల పాటు కొనసాగుతుంది. బ్లూ వేల్ ఆడే వ్యక్తులు ఒక సీక్రెట్​ ఆన్‌లైన్ గ్రూప్‌లో చేరతారు. ఈ గ్రూప్ నిర్వాహకులు ఆటగాళ్లకు ప్రతిరోజూ ఒక టాస్క్ ఇస్తారు. ఇవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. మొదట గేమ్​ మాస్టర్​ ఆటగాడితో చాలా సాఫ్ట్‌గా

ఉంటాడు. కంప్లీట్ చేయడానికి సహకరిస్తుంటాడు. మోటివేట్ చేస్తూ ఉంటాడు. రాను రానూ డేంజర్‌గా మారిపోతాడు. 50వ రోజు ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపిస్తాడు. 2015లో రష్యాకు చెందిన ఓ టీనేజర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో ప్రచారంలోకి వచ్చింది.

Next Story