దుబ్బాక ఉపఎన్నిక‌లో కత్తి కార్తీకకు వ‌చ్చిన ఓట్లు ఎన్నో తెలుసా..?

Kathi Karthika Votes In Dubbaka ByPoll. దుబ్బాక ఉపఎన్నికల కౌంటింగ్ కొద్దిసేప‌టి క్రితం ముగిసింది. బీజేపీ అభ్యర్థి

By Medi Samrat
Published on : 10 Nov 2020 5:59 PM IST

దుబ్బాక ఉపఎన్నిక‌లో కత్తి కార్తీకకు వ‌చ్చిన ఓట్లు ఎన్నో తెలుసా..?

దుబ్బాక ఉపఎన్నికల కౌంటింగ్ కొద్దిసేప‌టి క్రితం ముగిసింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజ‌య‌దుందుబి మోగించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల‌ని చూ‌సిన‌ బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీకకు చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. సీఈసీ సమాచారం ప్రకారం కేవ‌లం 620 ఓట్ల‌ను మాత్ర‌మే సాధించారు.

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె ప్రచారంలో అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. తనను అనేక విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని.. అనేక ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లో నిలవాలన్నదే తన ఆశని ఆమె చెప్పుకొచ్చారు.


Next Story