Renukaswamy Murder Case: వాళ్లిదరు తోటి నటులు..పెళ్లి కాలేదు!

కర్ణాటకలో చిత్రదుర్గగకు చెందిన రేణుకాస్వామి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla
Published on : 17 Jun 2024 8:18 AM IST

Karnataka, Renukaswamy, murder case, hero darshan, Pavithra,

Renukaswamy Murder Case: వాళ్లిదరు తోటి నటులు..పెళ్లి కాలేదు!

కర్ణాటకలో చిత్రదుర్గగకు చెందిన రేణుకాస్వామి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ్‌ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇదే కేసుపై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నటుడు దర్శన్‌ తరఫు లాయర్‌ జడ్జి ముందు కీలక విషయాలు చెప్పారు.

రేణుకాస్వామి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీనియర్ అధికారులు నటి పవిత్రను దర్శన్‌కు రెండో భార్యగా చెబుతున్నారని కోర్టు ముందు చెప్పారు. అందుకే ఈ వివరణ ఇస్తున్నట్లు చెప్పారు దర్శన్ తరఫు లాయర్ అనిల్‌బాబు. దర్శన్, పవిత్ర తోటి నటులు, స్నేహితులు మాత్రమే అన్నారు. వారు పెళ్లి చేసుకున్నట్లు చెప్పడం.. దర్శన్‌కు పవిత్ర భార్య అని ప్రసారాలు అవుతుండటటం సరికాదన్నారు. వారు పెళ్లి చేసుకున్నట్లు నిరూపించే పత్రాలు కూడా ఏవీ లేవని చెప్పారు. పవిత్రను దర్శన్‌ భార్యగా మీడియాలో చూపించడం వల్ల.. దర్శన్ భార్య విజయలక్ష్మి చాలా బాధపడుతున్నారని కోర్టులో చెప్పారు లాయర్ అనిల్ బాబు. అవమాన భారంతో ఆమె ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నారని చెప్పారు.

కాగా.. రేణుకాస్వామి హత్య కేసులో శనివారం పవిత్రగౌడ మేనేజర్ దేవరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకస్వామి హత్య చేసిన తర్వాత కారు షెడ్‌కు పవిత్రతో పాటు దేవరాజ్‌ కూడా వెళ్లినట్లు పోలీసులు నిర్దారించారు. దాంతో.. శనివారం రాత్రి దర్శన్, పవిత్రగౌడల నివాసాలకు వెళ్లి పంచనామా చేశారు. పవిత్రగౌడ రేణుకాస్వామిని చెప్పుతో కొట్టడాన్ని నిర్ధారించిన పోలీసులు.. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story