టీవీ జర్నలిస్టు దారణ హత్య

తమిళనాడు: ఓ తమిళ టీవీ రిపోర్టర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమాలను ప్రశ్నించినందుకు కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు

By సుభాష్  Published on  9 Nov 2020 10:31 AM GMT
టీవీ జర్నలిస్టు దారణ హత్య

తమిళనాడు: ఓ తమిళ టీవీ రిపోర్టర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమాలను ప్రశ్నించినందుకు కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా కుండ్రత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పోరంబోకు భూమిని అక్రమంగా అమ్ముతున్న కొందరికి వ్యతిరేకంగా మోజెస్‌ (25) కొంతకాలంగా వార్తలు రాస్తుండటమే ఈ హత్యకు కారణమని తెలిసింది. ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న దుండగులు గతంలో పలు మార్లు మోజెస్‌ను బెదిరించినట్లు తెలుస్తోంది. తమ దారికి రావొద్దని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మోజెస్‌ను ఇంటి నుంచి రప్పించిన దుండగులు అతన్ని కత్తులతో నరికి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అతని శరీరంపై 18 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు. జర్నలిస్టు హత్య కేసులో ఇప్పటి వరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అతని తండ్రి కూడా జర్నలిస్టు కావడం విశేషం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

( ఇది చదవండి: మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా పాజిటివ్‌)


Next Story