గాజు గ్లాసు గుర్తును మళ్లీ కేటాయించడం సంతోషం: పవన్ కళ్యాణ్
కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తుని మళ్లీ జనసేన పార్టీకే కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం.
By Srikanth Gundamalla
గాజు గ్లాసు గుర్తును మళ్లీ కేటాయించడం సంతోషం: పవన్ కళ్యాణ్
కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తుని మళ్లీ జనసేన పార్టీకే కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. రిజస్టర్డ్ అయిన గాజు గ్లాసు గుర్తుని జనసేన పార్టీకే కేటాయించడం సంతోషకరం అని చెప్పారు.
ఓటింగ్ శాతం లేకపోవడం, చట్టసభల్లో కనీస ప్రాతినిధ్యం లేకపోవడంతో జనసేన పార్టీ కొన్ని నెలల కిందట గ్లాసు గుర్తును కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ తర్వాత గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఎవరైనా ఉపయోగించుకునే వీలున్న సింబల్స్ జాబితాలో చేర్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో జనసేన పార్టీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ గుర్తుని తమకే కేటాయించాలంటూ కోరింది. జనసేన పార్టీ విజ్ఞప్తిపై స్పందించిన ఎన్నికల సంఘం ఆ పార్టీకే కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసింది. గ్లాసు గుర్తు జనసేన పార్టీకే చెందుతుందని ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గాజు గ్లాసు గుర్తుని మరోసారి జనసేనకే కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఏపీ, తెలంగాణలో జరిగిన గత ఎన్నికల్లో జనసేన అభ్యర్తులు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారని చెప్పారు. ఈ సారి కూడా గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేస్తారని.. జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. ఇక ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక జనసేన అభ్యర్థులు మాత్రం ఈసారి కూడా గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేస్తారని అర్థం అవుతుంది.
జనసేన పార్టీ ఎన్నికల గుర్తు "గాజు గ్లాస్"రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల గుర్తు "గాజు గ్లాసు" ను మరోసారి కేటాయించిన ఎన్నికల సంఘంగాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం - జనసేన ప్రభుత్వాన్ని తీసుకువద్దాం.#VoteForGlass pic.twitter.com/BG83kvIxQo
— JanaSena Party (@JanaSenaParty) September 19, 2023