రోహిత్ జట్టులో ఉంటే.. ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే..!

IPL2020 Cricket Final Update. ఐపీఎల్ 2020 ముందు కొన్ని ఆసక్తికర అంశాలను అందరూ పరిశీలిస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  10 Nov 2020 6:29 PM IST
రోహిత్ జట్టులో ఉంటే.. ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే..!

ఐపీఎల్ 2020 ముందు కొన్ని ఆసక్తికర అంశాలను అందరూ పరిశీలిస్తూ ఉన్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ ను నెగ్గింది. ఇప్పుడు అయిదోసారి ఐపీఎల్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న నాలుగు సార్లు కూడా ముంబై టైటిల్ ను ముద్దాడింది. ఇక రోహిత్ శర్మ ఐపీఎల్ ఫైనల్ ఆడిన ప్రతిసారీ ఛాంపియన్ గా నిలిచాయట.. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు.

2009లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ సారథ్యంలోని దక్కన్ ఛార్జర్స్ టైటిల్ కొట్టిన విషయం తెలిసిందే. అప్పుడు దక్కన్ ఛార్జర్స్ టీమ్‌లో రోహిత్ శర్మ ఉన్నాడు. 2010లో ఫైనల్లో ఆడిన ముంబై ఇండియన్స్ టీమ్‌లో రోహిత్ శర్మ లేడు. ఆ ఏడాది సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ముంబై బరిలోకి దిగి.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 22 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి ముంబై ఇండియన్స్ అభిమానులకు గుర్తు ఉండే ఉంటుంది.

2009, 2013, 2015, 2017, 2019లో ఫైనల్‌కి చేరిన ముంబై.. 2009లో మినహా అన్ని ఫైనల్లోనూ గెలుపొందింది. చివరిగా ఆడిన నాలుగు ఫైనల్లోనూ రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ముంబై కప్పు విజయం సాధించింది. ఇక 2020లో కూడా రోహిత్ ముంబై కెప్టెన్ గా ఉన్నాడు. ఈ ఏడాది టైటిల్ ను సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా ముంబైకి కొన్ని సెంటిమెంట్లు కలిసి వస్తుంటే.. ఢిల్లీకి కూడా మరికొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. ఏది ఏమైనా సెంటిమెంట్లను పక్కన ఉంచి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తే చాలని అభిమానులు మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.


Next Story