కన్నీళ్లను ఆపుకోలేకపోయిన కావ్య.. బాధను వ్యక్తం చేసిన అమితాబ్
క్రికెట్ అనేది చాలా క్రూయల్ గేమ్ అని ఊరికే అనలేదు.
By M.S.R Published on 27 May 2024 2:45 PM ISTకన్నీళ్లను ఆపుకోలేకపోయిన కావ్య.. బాధను వ్యక్తం చేసిన అమితాబ్
క్రికెట్ అనేది చాలా క్రూయల్ గేమ్ అని ఊరికే అనలేదు. ఎందుకంటే మ్యాచ్ మొత్తం ఆనందించిన వారిని ఆఖరి నిమిషంలో ఏడిపించేయగలదు. ఐపీఎల్ 2024 ఫైనల్ లో కూడా అలాంటిదే జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఫైనల్ మ్యాచ్ ఏ మాత్రం కలిసి రాలేదు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఓ దశలో ఏడుపును ఆపుకోలేకపోయింది. మ్యాచ్ తర్వాత, SRH యజమాని కావ్య మారన్ తన కన్నీళ్లను నియంత్రించలేకపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె స్పందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కావ్య బాధపడ్డంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. "ఐపీఎల్ ఫైనల్ ముగిసింది. KKR అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఫైనల్ లో SRH నిరాశపరిచింది. SRH మంచి జట్టు, వారు ఇతర మ్యాచ్‌లు ఆడిన రోజుల్లో అద్భుతమైన ప్రదర్శనలను చూశాం. ఇక బాధ కలిగించేది ఏమిటంటే, .. SRH యజమాని, స్టేడియంలో, ఓడిపోయిన తర్వాత ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు, నేను ఈ విషయంలో ఎంతగానో బాధపడ్డాను !!" అని ఆయన బ్లాగ్ లో రాసుకొచ్చారు. అయితే త్వరలోనే మంచి రోజులు వస్తాయని.. అవకాశాలు కూడా వస్తాయని వాటిని వదులుకోవద్దని అమితాబ్ సూచించారు.