శ్రీకృష్ణుడి గురించిన ఆసక్తికర విషయాలు ఇవే.!

Interesting facts about Lord Krishna. నేడు శ్రీకృష్ణాష్టమి.. విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జన్మాష్టమిని జరుపుకుంటారు.

By అంజి  Published on  19 Aug 2022 5:42 AM GMT
శ్రీకృష్ణుడి గురించిన ఆసక్తికర విషయాలు ఇవే.!

నేడు శ్రీకృష్ణాష్టమి.. విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను భక్తులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున భక్తులు శ్రీకృష్ణ దేవాలయాలను సందర్శిస్తున్నారు. స్వామి వారిని దర్శించి తమ మొక్కులను తీర్చుకుంటారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణ ఆలయాల్లో భక్తుల సందోహం నెలకొంది. ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. శ్రీకృష్ణుని నామస్మరణతో పలు ఆలయాలు మార్మోమోగుతున్నాయి.

శ్రీమహా విష్ణువు దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం తొమ్మిదవది. ఇది సంపూర్ణ అవతారం కూడా. మధురా నగరంలోని చెరసాలలో వేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు.. శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రాన రాత్రి వేళ జన్మించాడు. ఆ తర్వాత రేపల్లెలోని యశోదా నందుల ఇంటికి చేరి పెరిగి పెద్దవాడయ్యాడు. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మధురలో.. జన్మాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఇవాళ మధురలోని ఆలయాలన్నింటికీ ఒకే రంగు వేయడంతో పాటు.. శ్రీకృష్ణుడికి 56 నైవేద్యాలు సమర్పిస్తారు.

కృష్ణుడు గోపికలతో, స్నేహితులతో గడిపిన ప్రదేశమే.. బృందావనం. దీని సమీపంలోని యుమనా తీరంలోని మధువన్‌ అనే చోట కృష్ణుడు తన లీలలు ప్రదర్శించాడని భక్తులు నమ్ముతుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ.. మధువన్‌ అంతా నృత్య, గానాలతో హోరెత్తుతుంది. అయితే రాత్రి సమయంలో శ్రీకృష్ణుని ఏకాంతానికి భంగం కలగకుండా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఇక శ్రీకృష్ణుడి రాజధాని అయినా ద్వారకలో జన్మాష్టమి రోజున రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉండదు. రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. నేడు ఉత్సవ భోగం పేరుతో స్వామివారిని సుందరంగా అలంకరిస్తారు.

శ్రీకృష్ణుడి నిరాణ్యం..

బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడినుండి కృష్ణుడు స్వర్గానికి నేరుగా వెళ్ళాడని వ్యాసుని మహా భారతంలో ఉంది. అయితే ఒక నిషాదుని బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది. పురాణాలలో తెలిపిన ప్రకారం.. శ్రీకృష్ణుని నిర్యాణంతో ద్వాపరయుగం అంతమయింది. కలియుగం ఆరంభమయింది. ఇది క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 17/18 తేదీలలో జరిగిందని కొన్ని అంచనాలున్నాయి

ప్రసిద్ధ శ్రీకృష్ణ మందిరాలు

జగన్నాథ మందిరం - పూరి, ఒడిషా

గురువాయూరు మందిరం- కేరళ

శ్రీనాధ్ జీ మందిరం- నాథద్వార, గుజరాత్

మధుర, బృందావనం - ఉత్తర ప్రదేశ్

ఉడిపి - కర్ణాటక

ద్వారక - గుజరాత్

మన్నార్ గుడి, రాజగోపాల మందిరం - తమిళనాడు

హరేకృష్ణ మందిరాలు - మాయాపూర్, బెంగళూరు, ముంబై, తిరుపతి

వారిజాల వేణుగోపాలస్వామి- నార్కెట్ పల్లి, తెలంగాణ

Next Story