అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి

అమెరికాలో భారత్‌కు చెందిన విద్యార్థి మరణించాడు.

By Srikanth Gundamalla  Published on  30 Jan 2024 5:26 AM GMT
indian student, neel acharya, death,  america,

అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి 

అమెరికాలో భారత్‌కు చెందిన విద్యార్థి మరణించాడు. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో నీల్‌ ఆచార్య అనే విద్యార్థి చదువుతున్నాడు. ఆదివారం నుంచి నీల్‌ ఆచార్య కనిపించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. దాంతో.. అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నీల్‌ ఆచార్య చదువుతున్న యూనివర్సిటీలోని ఓ భవనం వద్ద మంగళవారం అతని మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్‌ క్లిఫ్టన్ వెల్లడించారు. కాలేజ్‌ మ్యాగజైన్‌ ది ఎక్స్‌పోనెంట్‌లో కూడా దీనికి సంబంధించిన వార్తను ప్రచురించారు.

అయితే.. అంతకు ముందే ఆదివారం నుంచి తన కొడుకు కనిపించడం లేదంటూ నీల్‌ ఆచార్య తల్లి గౌరీ ఆచార్య ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. అతడిని గుర్తించడంలో తమకు సాయం చేయాలని కోరింది. అయితే.. తాము చివరిసారిగా ఉబర్ డ్రైవర్‌ నీల్‌ ఆచార్యను క్యాంపస్‌లో విడిచిపెట్టినట్లు మాత్రమే తమకు తెలుసని చెప్పారు. ఈ పోస్ట్‌ షికాగాలోని భారత రాయబార కార్యాలయంలో గౌరీ ఆచార్య పోస్టుపై స్పందించింది. విశ్విద్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. అలాగే సుదురు కుటుంబానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ.. అంతలోనే నీల్‌ ఆచార్య మరణించాడని తెలిసింది. ఈ విషయం స్వయంగా పర్డ్యూ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. అసలు నీల్‌ ఆచార్య ఎలా మరణించాడని తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టిప్పెకోనో అధికారులు వెల్లడించారు.


Next Story