బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధం, అమెరికాలోని మార్కెట్లలో ఎగబడ్డ జనం

బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధంతో అమెరికాలో ఉన్న ఎన్నారైలలో తీవ్ర ఆందోళన నెలకొంది.

By Srikanth Gundamalla  Published on  22 July 2023 5:21 AM GMT
India, ban rice export, US, NRIs,

బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధం, అమెరికాలోని మార్కెట్లలో ఎగబడ్డ జనం

బాస్మాతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. దీంతో.. అమెరికాలో ఉన్న ఎన్నారైలలో తీవ్ర ఆందోళన నెలకొంది. భవిష్యత్‌లో బియ్యం దొరక్కపోవచ్చనే భయంతో ఎన్నారైలు పెద్ద ఎత్తున మార్కెట్లకు వెళ్తున్నారు. బియ్యం సంచుల కోసం ఎగబడుతున్నారు. భారీ ఎత్తున బియ్యం కొనుగోళ్లు చేస్తున్నారు. అంచనాలకు మించి మించి రైస్‌ బ్యాగులు కొంటున్నారు. ఒకేసారి ఎక్కువ జనాలు రావడంతో మార్కెట్లలో రద్దీ పరిస్థితి నెలకొంది. బియ్యం కోసం ఎగబడుతున్నారు. కంపెనీతో సంబంధం లేకుండా ఏ రకం బియ్యం సంచి దొరికినా తీసుకుంటున్నారు. రైస్‌ బ్యాగ్స్‌ కోసం అమెరికాలోని పలు మార్కెట్లలో ఎన్నారైలు ఎగబడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంతో అమెరికాలోని ఎన్నారైల్లో తీవ్ర అలజడి చెలరేగింది. భవిష్యత్తులో బియ్యానికి కటకట తప్పదన్న భయంతో ఎన్నారైలు పెద్ద ఎత్తున బియ్యం కొనుగోళ్లకు తెరలేపారు. అనేక సూపర్ మార్కెట్లలో బియ్యం స్టాక్ నిండుకోవడంతో నో స్టాక్ బోర్డు కనిపించింది. అంతేకాక ఎక్కువ మంది జనాలు బియ్యం కోసం ఎగబడుతుండటంతో ధరలు కూడా భారీగానే పెంచారు. గతంలో బ్యాగ్ 20 డాలర్లు ఉండగా.. ఇప్పుడు రెట్టింపు ధరకు అమ్ముతున్నట్లు తెలుస్తున్నది. అదీకాక అందరికీ అందాలన్న లక్ష్యంతో స్టోర్‌ మార్కెట్లు కూడా ఆంక్షలు విధించాయి. ఒక్కొక్కరు 5కి మించి రైస్‌ బ్యాగ్స్‌ కొనుగోలు చేయొద్దని సూచించాయి. ముఖ్యంగా బియ్యం కోసం సౌత్‌ ఇండియన్స్, తెలుగువారు ఎగబడినట్లు తెలుస్తోంది.

బాస్మాతీయేతర బియ్యం భారత్ నిషేధం విధించిన వార్త తెలియగానే అమెరికాలోని ఎన్నారైలంతా అలర్ట్‌ అయ్యారు. మళ్లీ బియ్యం దొరుకుతుందో లేదో అని వెంటనే మార్కెట్లకు వెళ్లారని అక్కడి స్టోర్‌ నిర్వాహకులు చెబుతున్నారు. భారత్‌ నుంచి ప్రకటన వచ్చిన వెంటనే భారీ ఎత్తున బియ్యం కొనుగోళ్లు పెరిగాయని చెబుతున్నారు. అంతేకాక కేంద్రం ఆంక్షలు విధించిన వెంటనే బియ్యం కూడా ఎగుమతులు అవ్వడం లేదని చెప్పుకొచ్చారు. అయితే.. ఇంతకు ముందు ఏవో కొన్ని వెరైటీలు మాత్రమే కొనేందుకు ఆసక్తి చూపే వారని.. కానీ కేంద్రం ఆంక్షలు విధించడంతో ఏది దొరికినా బియ్యం కొనుగోలు చేశారని చెబుతున్నారు.

అమెరికాలో ఉన్న దాదాపు 50 లక్షల మంది భారతీయులుంటే వీరిలో 90 శాతం మంది రైస్ వాడుతున్నారు. అందులో మన దేశీయ బియ్యం వినియోగిస్తున్నారు. మన దేశం ప్రతి సంవత్సరం దాదాపు 7 బిలియన్ డాలర్ల విలువ చేసే 12.5 మిలియన్ మెట్రిక్ టన్నుల(కోటి 25 లక్షల మెట్రిక్ టన్నులు) బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది.

ఇండియా ప్రపంచం కొనే బియ్యం ఉత్పత్తి చేసే దేశాలలో రెండో స్థానంలో వుంది. ఇండియా కంటే ముందుస్థానంలో చైనా ఉంది. అలాగే ప్రపంచంలో అన్ని దేశాలకు జరిగే బియ్యం ఎగుమతులతో 40% ఇండియా నుంచే. అయితే ఇండియా లో ఈ సంవత్సరం వచ్చిన పంటను బట్టి, మాన్సూన్ పరిస్థితులను బట్టి వచ్చిన బియ్యం ఉత్పత్తి దేశానికి సరిపోతుంది అని, ఎగుమతి చేస్తే దేశం లో బియ్యం కొరత రావచ్చు, దాని వలన ధరలు బాగా పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించి ఎగుమతులను నిలిపివేసిట్లుగా తెలుస్తోంది.

కాగా, ఇప్పటికిప్పుడు అమెరికాలో బియ్యం కొరత వచ్చే అవకాశం లేదని.. అయితే, భారతీయులు ఎగబడి కొనడం వల్లే తాత్కాలిక కొరత ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బియ్యం ఎగుమతుల విషయంలో భారత్ మరోసారి పునరాలోచన చేయాలని అక్కడివారు కోరుతున్నారు.

Next Story