తులసి మొక్కతో ఎన్నో ఉప‌యోగాలు..!

తులసి మొక్క ఆయుర్వేదం మరియు ప్రకృతి వైద్యంలో ప్రాముఖ్యతను కలిగి ఉంది.

By Kalasani Durgapraveen  Published on  10 Oct 2024 9:51 AM GMT
తులసి మొక్కతో ఎన్నో ఉప‌యోగాలు..!

తులసి మొక్క ఆయుర్వేదం మరియు ప్రకృతి వైద్యంలో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది హిందూ మతంలో పవిత్ర మొక్కగా పరిగణించబడుతుంది. భారతదేశంలో బాగా కనిపిస్తుంది. ఇది సాధారణంగా ఆగ్నేయాసియా దేశాలలోని కొన్ని ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తుంది. పవిత్ర తులసి దాని మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందినప్పటికీ.. ఇది ఆరోగ్యనికి చాలా మంచిది.

రోగనిరోధక శక్తిని పెంచి గుండె ఆరోగ్యానికి కాపాడుతుంది. హెర్బ్ జీర్ణ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది.తులసి నీటిని రోజు తీసుకోవడం వల్ల కడుపుకు చాలా మంచిది. ఇది శరీరం లో ఉన్న వ్యర్ధాలను బయటకు తీయడానికి సహాయపడుతుంది. గ్యాస్, ఉబ్బరం, జీర్ణక్రియ వంటి లక్షణాల నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది.అంటువ్యాధులు, అనారోగ్యాలను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తులసి తినాలి. ఇది విలువ గల నూనెలు, యాంటీఆక్సిడెంట్లతో ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు శరీరాన్ని అనారోగ్యం మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

డిటాక్సిఫికేషన్ అనేది రక్తాన్ని శుద్ధి చేయడం మరియు కాలేయంలోని రక్తంలోని మలినాలను వదిలించుకోవడం. తులసి శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. శరీరంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

Next Story