హార్ట్ ఎటాక్ పుకార్లు నమ్మొద్దు.. హైదరాబాద్ సీపీ వీడియో
హార్ట్ ఎటాక్ పుకార్లు నమ్మొద్దు.. హైదరాబాద్ సీపీ వీడియో
By Srikanth Gundamalla Published on 20 Nov 2023 4:25 PM IST
హార్ట్ ఎటాక్ పుకార్లు నమ్మొద్దు.. హైదరాబాద్ సీపీ వీడియో
హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. ఆయన్ని అపోలో ఆస్పత్రికి తరలించారనీ.. చికిత్స అందిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తలపై స్వయంగా హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య స్పందించారు. చిన్న అనారోగ్య సమస్య తలెత్తిందనీ.. స్పాండిలైటిస్, లోబీపీ కారణంగా అపోలో ఆస్పత్రికి వచ్చానని చెప్పారు. అలాగే.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వచ్చిన వార్తలు నిజం కాదని చెప్పారు. అలాగే.. ఒక్కరోజు రెస్ట్ తీసుకుని.. రేపట్నుంచి విధులకు హాజరు అవుతానని కూడా వెల్లడించారు హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య.
ఈ మేరకు సందీప్ శాండిల్య ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలోనే ఈ విషయాలన్నీ వెల్లడించారు. మరోవైపు సందీప్ శాండిల్య హార్ట్ ఎటాక్‌కు గురయ్యారంటూ కొందరు ప్రచారం చేశారు. ఏదీ ఏమైనా ఆయనే స్పందించి పెద్దగా సమస్య లేదని చెప్పడంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లు అయ్యింది. ఇక ఎన్నికల వేళ ఆయన్ని అక్టోబర్ లో ఎలక్షన్ కమిషన్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఎక్కడా ప్రలోభాలకు తెరలేపకుండా.. పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సందీప్ శాండిల్యను హైదరాబాద్ సీపీగా నియమించింది.
గుండెపోటు పుకార్లను నమ్మొద్దు అంటూ హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య వీడియోస్పాండిలైటిస్తో బాధపడుతున్నానని వెల్లడించిన సందీప్ శాండిల్య ఒకరోజు ఆస్పత్రిలో వైద్యుల పరిశీలనలో ఉంటున్నట్లు చెప్పిన సీపీ సందీప్ శాండిల్య pic.twitter.com/V1QA1NZJPu
— Newsmeter Telugu (@NewsmeterTelugu) November 20, 2023