బిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్‌లో పురుగు, వెజ్‌కి బదులు నాన్‌వెజ్
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ద్వారా ఈజీగా ఆహారాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. కానీ.. ఇందులో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 7:15 AM ISTబిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్‌లో పురుగు, వెజ్‌కి బదులు నాన్‌వెజ్
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ద్వారా ఈజీగా ఆహారాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. కానీ.. ఇందులో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆర్డర్ చేసింది ఒకటి అయితే.. మరోటి డెలివరీ అవుతుంది. కొందరు రెస్టారెంట్ నిర్వాహకులు వెజిటేరియన్స్‌ను మోసం చేస్తున్నారు. ఆ.. ఎవరు గుర్తు పడుతారులే అని నాన్‌వెజ్ బిర్యానీలో నుంచి మాంసాన్ని తీసే వెజ్ బిర్యానీగా పార్శిల్ చేస్తున్నారు. ఇంకొందరు నిర్లక్ష్యంగా ఆహారాన్ని వండుతూ కస్టమర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన సాయితేజ అనే వ్యక్తి స్విగ్గిలో చికెన్ బిర్యానీని ఆర్డర్ చేశాడు. కూకట్‌పల్లిలోని మెహ్‌ఫిల్ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసి.. ఇష్టంగా తినేందుకు ఓపెన్ చేశాడు. బిర్యానీ తింటూ ఉండగా.. చికెన్ ముక్కలో కనిపించిన పురుగుని చూసి షాక్ అయ్యాడు. దాన్ని ఫోటో తీసి స్విగ్గీ కస్టమర్ కేర్‌కి కంప్లైంట్ చేశాడు. కంపెనీని నిలదీశాడు. దాంతో స్పందించిన స్విగ్గీ యాజమాన్యం.. అతనికి ఎదురైన అనుభవం పట్ల క్షమాపణలు కోరింది. అలాగే.. అతనికి జరిగిన లాస్‌ను కూడా రీఫండ్ చేసింది. ఈ ఫోటలన్నింటీ సదురు కస్టమర్ ఎక్స్ వేదికగా కూడా షేర్ చేశాడు. అయితే.. సాయితేజ పోస్ట్‌పై మరో వ్యక్తి స్పందించాడు. తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. తాను కూడా కూకట్‌పల్లిలోని మెహ్‌ఫిల్ రెస్టారెంట్ నుంచి పన్నీర్ బిర్యానీని ఆర్డర్ చేశాననీ.. అయితే దాంట్లో తనకు ఒక ఎముక వచ్చిందని తెలిపాడు. సదురు రెస్టారెంట్ తనని మోసం చేసిందని వాపోయాడు. ఈ పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Same issue I have ordered a Paneer Biryani in mehfil, Nizampet Kukatpally I got a bone in it. pic.twitter.com/2YbteDdrNF
— AVINASH (@Avinashtime) June 24, 2024
చికెన్‌లో పురుగు, వెజ్ బిర్యానీలో ఎముక వచ్చిన ఇద్దరు కస్టమర్లకు స్విగ్గీ సంస్థ క్షమాపణలు చెప్పింది. ఇది పూర్తిగా రెస్టారెంట్ నిర్వాహకుల బాధ్యతగా పేర్కొంది. కస్టమర్లకు ఎదురైన అనుభవం పట్ల చింతిస్తున్నట్లు స్విగ్గి కస్టమర్ కేర్ తెలిపింది. దీనిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలని సూచించింది. దాంతో.. సాయి తేజ కూడా FSSAIకి కంప్లైంట్ చేసినట్లు ఎక్స్‌లో పేర్కొన్నాడు.