సీమంతంలో షాక్ ఇచ్చిన భర్త.. భార్య కడుపులోని బిడ్డకు తాను తండ్రిని కాదంటూ..

ఓ వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

By Medi Samrat  Published on  9 Nov 2020 1:48 PM IST
సీమంతంలో షాక్ ఇచ్చిన భర్త.. భార్య కడుపులోని బిడ్డకు తాను తండ్రిని కాదంటూ..

ఓ వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇందుకు సీమంతం వేడుకను వాడుకున్నాడు. బోలివియాకు చెందిన ఓ జంటకు పెళ్లైయి ఐదు సంవ‌త్స‌రాలు అయ్యింది. పెళ్లైన కొత్త‌లో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. త‌రువాత భార్య ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆమె గ‌ర్భం దాల్చింది. అయితే.. ఆ గ‌ర్భం త‌న వ‌ల్ల రాలేద‌ని ఆ భ‌ర్త బావించాడు. భార్య‌కు తెలియ‌కుండా డీఎన్ఏ ప‌రీక్ష చేయించాడు. అత‌డి అనుమాన‌మే నిజమైంది. ఆ రిపోర్టుల‌ను భార్య‌కు తెలియ‌కుండా జాగ్ర‌త్త‌గా దాచాడు.

భారీ ఎత్తున సీమంతం ఏర్పాటు చేశాడు. ఈ వేడు‌క‌కు బంధువుల‌తో పాటు భార్య ప్రియుడిని ఆహ్వానించాడు. ఈ వేడుక‌కు భ‌ర్త త‌రుపు లాయ‌ర్ కూడా హాజ‌ర‌య్యాడు. అంద‌రూ ఉత్సాహాంగా ఉన్న సమ‌యంలో.. త‌న భార్య‌కు పుట్ట‌బోయే బిడ్డ‌కు తాను తండ్రిని కాద‌ని చెప్పి అంద‌రికీ షాకిచ్చాడు. వీరి రాసలీలను, ఆస్పత్రి రిపోర్టులను బంధువులందరికీ చూపించాడు. ఈ వీడియోలు ప్లే చేయటం మొదలు పెట్టగానే సదరు మహిళ లేచి ఆపేయమని భర్తను కోరింది. అయిన‌ప్ప‌టికీ అలాగే ప్లే చేశాడు. భార్య వివాహేత‌ర సంభందం పెట్టుకున్న ఆ వ్యక్తి మరెవరో కాదు వారి కుటుంబ సభ్యుల్లో ఒకడే. అత‌డు కూడా అక్క‌డే ఉండ‌డంతో.. బంధువులు సదరు వ్యక్తిని చితకబాదారు. భార్యను ఏలుకోలేనంటూ ఆ భ‌ర్త తేల్చిచెప్పాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.


Next Story