భారత్‌లో హోలీ జరగని ప్రదేశాలున్నాయ్.. ఎక్కడో తెలుసా?

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలంతా రంగులు జల్లుతూ హోలీ పండుగను ఘనంగా చేసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on  25 March 2024 12:56 PM IST
holi,  no celebrate,  places,  india,

భారత్‌లో హోలీ జరగని ప్రదేశాలున్నాయ్.. ఎక్కడో తెలుసా?

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలంతా రంగులు జల్లుతూ హోలీ పండుగను ఘనంగా చేసుకుంటున్నారు. రంగుల్లో మునిగి తేలుతున్నారు. అయితే.. మన ఇండియాలోనే ఈ రంగుల పండుగను జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఆశ్చర్యపోకండి.. ఇది నిజమే. ఇక ఆయా ప్రాంతాల్లో హోలీ వేడుకలను జరుపుకోకపోవడానికి కారణాలు కూడా లేకపోలేదు. అయితే.. హోలీ సంబరాలు లేని ఆ ప్రదేశాలేంటో ఓ సారి చూద్దామా!

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న మూడు గ్రామాల్లో ఈ హోలీ సంబరాలను చేసుకోరు. క్విలీ, కుర్జాన్, జౌడ్లా అనే ఈ మూడు గ్రామాల్లో హోలీ పండుగను నిషేధించారు పెద్దలు. దీనికి కారణం కూడా ఉంది. తమ ఇష్ట దైవమైన త్రిపుర సుందరి దేవి. ఆ దేవతకు శబ్దాలు నచ్చవనీ.. అంతేకకా తమకు హోలీ పండుగ అచ్చిరాదని దీనికి దూరంగా ఉంటున్నారు. దాదాపు 150 ఏళ్ల క్రితం ఈ మూడు గ్రామాల్లో హోలీ జరిగేది. ఆ సమయంలోనే కలరా మహమ్మారి వ్యాపించింది. దాంతో.. హోలీ పండుగపైనే ఇక్కడ నిషేధం విధించారు. ఆనవాయితీగా వస్తోన్న ఈ హోలీ పండుగ రద్దుని ఆయా గ్రామస్తులు ఇప్పటికీ పాటిస్తున్నారు.

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో కూడా హోలీ జరుపుకోని ఓ గ్రామం ఉంది. రంసాన్‌ అనే గ్రామం కొందరు సాధువల చేత వాపగ్రస్తమైందట. దాంతో.. అప్పటి నుంచి ఇక్కడ హోలీ పండుగను జరుపుకోవడం మానేశారు. అదే కొనసాగుతూ వస్తోంది.

జార్ఖండ్‌లోని బొకారోలోని దుర్గాపూర్‌ గ్రామంలో కూడా దాదాపు వంద ఏళ్లకు పైగా హోలీ సంబరాలు జరగడం లేదు. అయితే.. శతాబ్దం క్రిందట ఇక్కడ హోలీ రోజునే రాజు కుమారుడు మరణించాడట. దాంతో.. హోలీ సంబరాలను రద్దు చేశారు. హోలీ చేసుకుంటే అరిష్టమని గ్రామస్తులు భావిస్తారట. ఇక హోలీ వేడుకలంటే బాగా ఇష్టం ఉన్నవారు మాత్రం దుర్గాపూర్‌ నుంచి పక్క గ్రామాలకు వెళ్లి వేడుకల్లో పాల్గొంటారు.

మధ్యప్రదేశ్‌లోని బైతుల్ జిల్లాలోని దహువా గ్రామంలో కూడా హోలీ పండుగను జరపుకోరు. 125 ఏళ్ల క్రిందట బావిలో మునిగి చనిపోయాడట. ఈ విషాద ఘటనతో హోలీ ఆడటం తమకు చెడుగా భావించారు గ్రామస్తులు. దాంతో.. అప్పటి నంచి దహువా గ్రామంలో హోలీ పండుగను జరుపుకోవడం మానేశారు.

Next Story