నాక్‌ నాక్‌ అంటూ అటల్‌ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన ప్రధాని

సముద్రంపై భారత ప్రభుత్వం నిర్మించిన అత్యంత పొడవైన వంతెన 'అటల్‌ సేతు'.

By Srikanth Gundamalla  Published on  17 May 2024 5:11 AM GMT
heroine rashmika, video,  atal setu bridge, pm modi, tweet,

నాక్‌ నాక్‌ అంటూ అటల్‌ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన ప్రధాని

సముద్రంపై భారత ప్రభుత్వం నిర్మించిన అత్యంత పొడవైన వంతెన 'అటల్‌ సేతు'. ఈ బ్రిడ్జిని కొంతకాలం ముందే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ అటల్‌ సేతు బ్రిడ్జిపై ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రయాణించారు. ఈ సందర్భంగా ఒక వీడియో చేసిన ఆమె.. అటల్‌ సేతు బ్రిడ్జిపై తెగ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి అద్భుతం భారత్‌లో నిర్మించడం సంతోషమన్నారు. భారత్‌ అభివృద్ధిలో ముందుంది అంటూ రష్మిక మందన్న వీడియో చేశారు. ఇక ఇదే వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్‌ ఖాతాలో రీట్వీట్‌ చేశారు.

ముంబై, నవీ ముంబైని కలుపుతూ 22 కిలోమీటర్ల మేర అటల్‌ సేతు వంతెనను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఈ బ్రిడ్జి నిర్మాణం లేకముందు ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి 2 గంటల సమయం పట్టేది. కానీ.. వంతెనను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత కేవలం 20 నిమిషాల్లో ముంబై, నవీ ముంబై మధ్య ప్రయాణం సాగుతోందని రష్మిక తన వీడియోలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం అటల్‌ సేతు వంతెనను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇటీవల ఈ వంతెనపై ప్రయాణించిన రష్మిక.. దాని నిర్మాణ శైలిని కొనియాడారు. ప్రజలకు అటల్‌ సేతు బ్రిడ్జి ఉపయోగపడుతున్న తీరుపై ప్రశంసించారు. ఒకప్పుడు రెండు గంటల పాటు ప్రయాణం కొనసాగేదనీ.. కానీ ఇప్పుడు 20 నిఇషాలకు ఇది తగ్గిందన్నారు. ఇది అస్సలు నమ్మశక్యంగా లేదన్నారు. అసలు నమ్మశక్యంగా లేదన్నారు రష్మిక. ఇలాంటి వంతెనను నిర్మించడం సాధ్యమని ఎవరూ ఎప్పుడూ ఊహించలేదనీ.. కానీ భారత్‌ దీన్ని చేసి చూపించిందన్నారు. ముంబై నుంచి నవీ ముంబై వరకూ, ముంబై నుంచి బెంగళూరు వరకూ, గోవా నుంచి ముంబై వరకూ అద్భుత మౌలిక సదుపాయాల కల్పనతో ప్రతి ప్రయాణం సులువుగా సౌకర్యవంతంగా మారిపోయిందని రష్మిక అన్నారు.

ఇక రష్మిక చేసిన వీడియోపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆమె వీడియోను రీట్వీట్ చేశారు. ప్రజల జీవితాలను మెరుగుపర్చడం.. వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే ఆనందం ఏముంటుందన్నారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం ఎంటీహెచ్‌ఎల్‌కు ‘అటల్‌ సేతు’ అని ప్రభుత్వం నామకరణం చేసింది.

Next Story