సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిన హీరో సిద్ధార్థ్

సైబర్ నేరాలు, డ్రగ్స్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది.

By Srikanth Gundamalla  Published on  9 July 2024 2:15 AM GMT
hero Siddharth, clarity,   cm revanth reddy, cinema,

సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిన హీరో సిద్ధార్థ్ 

సైబర్ నేరాలు, డ్రగ్స్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ నటులు కూడా ఈ వ్యతిరేక ప్రచారంలో పాల్గొని యువత భవిష్యత్‌ను కాపాడాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నటులకు సామాజిక బాధ్యత ఉందంటారా? అని భారతీయుడు-2 టీమ్‌ను ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు. దీనిపై స్పందించిన సిద్ధార్థ్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు తెలుసని అన్నారు. సురక్షిత శృంగారం గురించి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. దాదాపు 6 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో తన హోర్డింగ్స్ ఉన్నాయని తెలిపాడు. అది తన బాధ్యత.. ప్రతి నటుడు సామాజిక బాధ్యత కలిగి ఉంటాడని పేర్కొన్నాడు సిద్దార్థ్. కచ్చితంగా తమకు చెప్పాల్సిన అవసరం లేదనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు హీరో సిద్ధార్థ్.

దాంతో సిద్దార్థ్‌ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్‌ను విమర్శించారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా సిద్దార్థ్‌ తన కామెంట్స్‌పై స్పందించారు. తాను ఒక కోణంలో చెబితే కొందరు మరోలా ప్రచారం చేశారంటూ తెలిపారు. ఈ మేరకు కొత్త వీడియోను విడుదల చేశాడు హీరో సిద్ధార్థ్.

‘భారతీయుడు 2’ ప్రెస్‌మీట్‌లో ఓ ప్రశ్నకు నేనిచ్చిన సమాధానాన్ని కొందరు అపార్థం చేసుకున్నారు. దానిపై క్లారిటీ ఇచ్చి క్లియర్ చేయాలని అనుకుంటున్నా. డ్రగ్స్‌పై పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి గారికి నా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. మెరుగైన సమాజం కోసం డ్రగ్స్‌ కట్టడికి సినీ పరిశ్రమ తన వంతు కృషి చేయాలని సీఎం సూచించారు. మన పిల్లల భవిష్యత్తు వారి చేతుల్లోనే కాకుండా మన చేతుల్లోనూ ఉంది. ఇప్పటి వరకూ పలు సామాజిక కార్యక్రమాలను నేను సపోర్ట్‌ చేశా. సీఎం సర్‌.. మేం ఎప్పుడూ మీతోనే’’ అని పేర్కొన్నారు.

కాగా...శంకర్ డైరెక్షన్లో కమల్‌ హాసన్ హీరోగా భారతీయుడు-2 సినిమా వస్తోంది. ఇందులో ముఖ్యపాత్రలో సిద్ధార్థ్ కనిపించనున్నాడు. రకుల్‌ సహా పలువురు నటులు ఉన్నారు. ఈనెల 12న థియేటర్లలో విడుదల కానుంది.

Next Story