కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. అయితే ఇటీవల హీరో రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడగా, రాజశేఖర్ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. ఇక సోమవారం ఆయన కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన భార్య జీవిత, కుమార్తె శివానీ, శివాత్మికలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది త్వరగా కోలుకోగా, రాజశేఖర్‌కు కాస్త ఆరోగ్యం క్షీణించడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఇక చికిత్స పొంది ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు.
గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వచ్చారు వైద్యులు. తాజాగా రాజశేఖర్‌కు కరోనా నెగిటివ్ రావడం, ఆరోగ్యంగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు వైద్యులు. రాజశేఖర్ ఆరోగ్యంపై వైద్యులు ప్రత్యేక శ్రద్ద చూపించారని, మొదట్లో రాజశేఖర్ ఆరోగ్యం క్షీణించిన వైద్యుల కృషి వల్ల మెరుగుపడి డిశ్చార్జి అయ్యారని ఆయన సతీమణి జీవిత తెలిపారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగు పడాలని కోరుకున్న అభిమానులందరికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.