రోహిత్ సేన‌కు గూగుల్ స‌ర్‌ప్రైజ్‌

Google Surprise to Mumbai Indians. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో త‌మ‌కు ఎదురులేదు అని మ‌రోసారి నిరూపించుకుంది

By Medi Samrat  Published on  11 Nov 2020 6:09 AM GMT
రోహిత్ సేన‌కు గూగుల్ స‌ర్‌ప్రైజ్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో త‌మ‌కు ఎదురులేదు అని మ‌రోసారి నిరూపించుకుంది ముంబై ఇండియ‌న్స్. ఈ సీజ‌న్‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సార్లు ఫైన‌ల్ ఆడిన ఆ జ‌ట్టు ఐదుసార్లు విజేత‌గా నిలిచింది. మంగ‌ళవారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

టాస్ గెలిచిన శ్రేయాస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. శ్రేయస్‌ అయ్యర్‌(65 నాటౌట్‌; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు) రిషభ్‌ పంత్‌(56; 38 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు) లు రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర‌ల్లో 7 వికెట్ల న‌ష్టానిక 156 ప‌రుగులు చేసింది. 157 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముంబై 18.4 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌( 68; 51 బంతుల్లో 5 పోర్లు, 4 సిక్స‌ర్లు), బాద్య‌తాయుత ఇన్నింగ్స్ ఆడ‌గా.. ఇషాన్ కిష‌న్(33నాటౌట్‌; 19 బంతుల్లో 3 పోర్లు, 1 సిక్స్‌) పినిషింగ్ ట‌చ్ ఇచ్చాడు. డికాక్ (20 12బంతుల్లో 3పోర్లు, 1 సిక్స్‌), సూర్య‌కుమార్ యాద‌వ్‌(19 20 బంతుల్లో 1పోర్‌, 1 సిక్స్‌)లు రాణించ‌డంతో.. ముంబై ఐదో సారి టైటిల్‌ను ఎగ‌రేసుకుని పోయింది.

ముంబై సాధించిన ఐదు టైటిల్స్ కూడా రోహిత్ సార‌థ్యంలోనే కావ‌డం విశేషం. 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ సీజ‌న‌ల్లో ముంబై ఇండియ‌న్స్‌ ఐపీఎల్ టైటిల్స్‌ను గెలిచింది. ముంబై త‌రువాత రెండ స్థానంలో చెన్నై నిలిచింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్స్‌ను సాధించింది.

ఇదిలా ఉంటే.. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు సెర్చ్ ఇంజిన్ దిగ్గ‌జం గూగుల్ పెద్ద స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. గూగుల్‌లోకి వెళ్లి ముంబై జ‌ట్టు పేరుతో వెతికితే.. తారాజువ్వ‌లు స్ర్కీన్‌పై వెలిగేలా ఏర్పాటు చేసింది. ముంబై జ‌ట్టు వివ‌రాల‌తో పాటు ఢిల్లీతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ స్కోర్ బోర్డు కూడా స్ర్కీన్‌పై పై క‌నిపిస్తున్నాయి.


Next Story