భారీగా పడిపోయిన బంగారం ధరలు
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తర్వాత బంగారం ధరలు తగ్గుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 July 2024 7:55 AM ISTభారీగా పడిపోయిన బంగారం ధరలు
ప్రతికూల సంకేతాల నడుమ గోల్డ్ రేట్లు ఆకాశాన్ని తాకాయి. ఆల్ టైమ్ గరిష్టాలకు వెళ్లాయి. దీంతో కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. అయితే.. గత జూన్ నెలలో బంగారం ధరలు కాస్త తగ్గినట్లు కనిపించినా.. మరోసారి జూలై ఆరంభంలో పైస్థాయికి వెళ్లాయి. అయితే.. తాజాగా బంగారం ధరలు కుప్పకులూతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజు గోల్డ్ రేట్లు తగ్గాయి. దీంతో ఇప్పుడు కొనాలనుకునే వారికి మంచి సమయం అని చెప్పొచ్చు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తర్వాత బంగారం ధరలు తగ్గుతున్నాయి. బడ్జెట్ ప్రసంగంలో గోల్డ్, సిల్వర్‌పై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అదే రోజు ఒక్కసారిగా పసిడి ధర కుప్పకూలింది. రూ. 3 వేల వరకు పడిపోయింది. అంతకుముందు 4 రోజులుగా కూడా గోల్డ్ రేటు తగ్గింది.ఇక తాజాగా మరోసారి శుక్రవారం కూడా మళ్లీ భారీగా దిగొచ్చింది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు :
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 950 తగ్గింది. దాంతో.. తులం బంగారం ధరరూ. 64 వేల మార్కుకు చేరింది. అంతకుముందు కూడా వరుసగా రూ. 2750, రూ. 100, రూ. 350, రూ. 450, రూ. 150 ఇలా పతనం కొనసాగింది. ఈ లెక్కన గత కొద్ది రోజుల్లో సుమారు రూ.5 వేల వరకు బంగారం ధర పడిపోయిందని చెబుతున్నారు. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 1040 పతనంతో ప్రస్తుతం రూ. 69,820 వద్ద కొనసాగుతోంది.