సాహితీ ఇన్ఫ్రా ఆస్తుల సీజ్.. ఎన్ని కోట్ల మోసాలకు పాల్పడ్డారంటే?
సాహితీ ఇన్ ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన స్థిరాస్తుల ను ఈడీ ఎటాచ్ చేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Dec 2023 2:27 PM ISTసాహితీ ఇన్ఫ్రా ఆస్తుల సీజ్.. ఎన్ని కోట్ల మోసాలకు పాల్పడ్డారంటే?
సాహితీ ఇన్ ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన స్థిరాస్తుల ను ఈడీ ఎటాచ్ చేసింది. సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటె డ్ మేనేజింగ్ డైరెక్టర్ బి.లక్ష్మీనారాయణ, మా జీ డైరెక్టర్ పూర్ణచంద్రారావు.. ఇతర కుటుంబ సభ్యులకు చెందిన రూ. 161.50 కోట్ల ఆస్తుల ను సీజ్ చేసింది. 2022 డిసెంబర్‌లో సాహితీ ఇన్‌ఫ్రా గ్రూప్ ఎండి లక్ష్మీనారాయణని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమీన్‌పూర్‌లో ప్రీ లాంచ్ పేరుతో 2500 మంది కస్టమర్ల దగ్గర సాహితీ గ్రూప్ రూ.900 కోట్లు వసూలు చేసి వెంచర్‌ని స్టార్ట్ చేయలేదనే అభియోగాలున్నాయి. దీనిపై కస్టమర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాజెక్ట్ ఫెయిల్ కావడంతో 18శాతం వడ్డీతో డబ్బులు తిరిగిస్తానని లక్ష్మీనారాయణ బాధితులు చెప్పారు. చెప్పినట్లే ఆయన చెక్కులు ఇవ్వగా, ఆ చెక్కులు బౌన్స్ అవడంతో సిసిఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SIVIPL) ఫ్లాట్‌లు/విల్లాలను అందజేస్తామని వాగ్దానం చేసి.. రూ. 248.27 కోట్ల మొత్తంలో మోసం చేసిందని.. ఈ సంస్థలో భాగంగా వివిధ ప్రాజెక్ట్‌లకు చెందిన 655 మంది పెట్టుబడిదారులు/కొనుగోలుదారులు ఫిర్యాదులు చేశారు.
శ్రావణి ఎలైట్ ప్రాజెక్ట్ ఊసే లేదు
సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియాపై సెక్షన్ 420 IPC (చీటింగ్) కింద తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన అనేక ఫిర్యాదులపై కేంద్ర ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమీన్‌పూర్ గ్రామంలోని సర్వాణి ఎలైట్ ప్రాజెక్ట్‌తో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం SIVIPL కస్టమర్ల నుండి రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ED దర్యాప్తులో వెల్లడైంది. SIVIPL అమీన్‌పూర్ గ్రామంలో 89 కోట్ల రూపాయలకు భూమిని కొనుగోలు చేసింది. అయితే, ప్రాజెక్టు ప్రారంభించి మూడేళ్లు గడుస్తున్నా SIVIPL ద్వారా ఆ భూమిలో ఎలాంటి నిర్మాణం ప్రారంభించలేదు.
మనీ లాండరింగ్ ఆరోపణలు:
అమీన్‌పూర్ విలేజ్‌లో ఒమిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్న తొమ్మిది ఎకరాల భూమిని అభివృద్ధి చేయడానికి జూన్ 12, 2020 నాటి ఒప్పందానికి వ్యతిరేకంగా SIVIPL ఒమిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కి రూ. 32.15 కోట్లు చెల్లించింది. అయితే Omics International Ltd. సంస్థ SIVIPLకి రూ. 3 కోట్ల మొత్తంలో రెండు ఎకరాలను మాత్రమే బదిలీ చేసింది. మిగిలిన రూ. 29.15 కోట్లకు సంబంధించి ఇంకా సరైన సమాచారం లేదు.
“SIVIPL మాజీ డైరెక్టర్, అప్పటి సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ హెడ్ అయిన సందు పూర్ణచంద్రరావు SIVIPL కస్టమర్ల నుండి సేకరించిన రూ. 126 కోట్లను దుర్వినియోగం చేశారు, ఇందులో 2018- ఆగస్టు 2020 మధ్య కస్టమర్ల నుండి నగదు రూపంలో సేకరించిన రూ. 50 కోట్లు ఉన్నాయి. పూర్ణచంద్రరావుకు స్థిరాస్తులు ఉన్నాయి. అతని పేరు మీద గాని లేదా అతని కుటుంబ సభ్యులు లేదా సంస్థల పేరుతో గాని కోట్లాది రూపాయల విలువైనవి ఉన్నాయి. ప్రధానంగా SIVIPL కు రాజీనామా చేసిన తర్వాత వచ్చిన ఆదాయాన్ని లాండరింగ్ చేయడం ద్వారా ఆస్తులను కూడగట్టాడు”అని ED తన దర్యాప్తులో తెలిపింది.