దుబ్బాక ఉపఎన్నిక : తొలి రెండు రౌండ్‌లలో బీజేపీకి ఆధిక్యం
Dubbaka Bypoll 2nd Round Counting Completed
By Medi Samrat Published on
10 Nov 2020 4:16 AM GMT

దుబ్బాక ఉపఎన్నిక తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 341 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. మొదటి రౌండ్‌లో బీజేపీ 3,208 ఓట్లు సాధించగా.. టీఆర్‌ఎస్ 2,867.. కాంగ్రెస్ 648 ఓట్లు సాధించాయి. తొలి రౌండ్‌లోదుబ్బాక మండలానికి చెందిన ఈవీఎంలలోని ఓట్లను లెక్కించారు.
ఇక రెండో రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 6492 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 5357, కాంగ్రెస్‌కు 1315 ఓట్లు వచ్చాయి. అయితే రెండో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 1135 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదిలావుంటే.. దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8.15 గంటలకు ప్రారంభమైంది.
Next Story