మొదలైన దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నువ్వా.. నేనా.. అన్నట్లు సాగిన ఈ పోలింగ్‌ ఫలితాలపై ఎంతో ఉత్కంఠగా

By సుభాష్  Published on  10 Nov 2020 8:20 AM IST
మొదలైన దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నువ్వా.. నేనా.. అన్నట్లు సాగిన ఈ పోలింగ్‌ ఫలితాలపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తునన్నారు. ఈనెల 3న పోలింగ్‌ జరుగగా, ఓట్ల లెక్కింపు సిద్దిపేట సమీపంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతోంది. 315 పోలింగ్‌ స్టేషన్‌ల పరిధిలో ఉప ఎన్నిక జరిగింది. అయితే మొత్తం 23 మంది పోటీ చేయగా, మొత్తం రెండు గదుల్లో ఒక్కో గదిలో ఏడు టేబుళ్ల చొప్పున 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఈ ఫలితాలు మధ్యాహ్నం 12 గంటల వరకు తేలిపోనుంది.

మొటి అరగంట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు

కాగా, మొదటి అరగంట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఎం మిషన్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఇందు కోసం భద్రతాపరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రతీ రౌండ్‌కు సంబంధించి కౌంటింగ్‌ వారీగా ఎంట్రీలు చేపట్టనున్నారు. కౌంటింగ్‌ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వెబ్‌ సైట్‌లో రౌండ్‌ల వారీగా పొందుపరుస్తామని తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కావాల్సిన సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తయిందని, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.




Next Story