Telangana: ప్రణీత్‌ హనుమంతుపై డ్రగ్స్ కేసు నమోదు

యూట్యూబ్‌లో తండ్రి కూతురుపై అసభ్యకరంగా మాట్లాడుతూ వీడియో చేసిన ప్రణీత్‌ హనుమంతను పోలీసులు అరెస్ట్ చేాశారు.

By Srikanth Gundamalla  Published on  19 July 2024 1:30 PM IST
drugs case,  praneeth hanumanthu, Hyderabad ,

Telangana: ప్రణీత్‌ హనుమంతుపై డ్రగ్స్ కేసు నమోదు 

యూట్యూబ్‌లో తండ్రి కూతురుపై అసభ్యకరంగా మాట్లాడుతూ వీడియో చేసిన ప్రణీత్‌ హనుమంతను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతను విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ప్రస్తుతం అతను చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తాజాగా ప్రణీత్‌ హనుమంతుపై మరో కేసు నమోదు అయ్యింది. అతను మాదకద్రవ్యాలు, గంజాయి సేవించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మరో కేసు నమోదు చేశారు. దాంతో.. 67 బీ, ఐటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంతేకాదు.. 79, 297 బీఎన్‌ఎస్‌, ఎన్డీపీఎస్‌ చట్టాల కింద కూడా కేసులు నమోదు చేశౄమన్నారు. నిందితుడిని మూడ్రోజుల కస్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

కాగా.. యూట్యూబర్‌ హనుమంతును పోలీసులు ఈనెల 10వ తేదీన అరెస్ట్ చేశారు. అమెరికాకు పారిపోతుండగా బెంగళూరులో పట్టుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రణీత్‌, డల్లాస్ నాగేశ్వరరావు, మరో ఇద్దరు కలిసి డార్క్ కామెడీ పేరుతో తండ్రి, కూతురు వీడియోపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. దీనిపై టాలీవుడ్‌ నటులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరడంతో పోలీస్‌ శాఖ, ప్రభుత్వం స్పందించింది. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే.. వీడియో వైరల్ కావడం.. నెటిజన్లు విమర్శలు చేయడం.. వివాదం పెద్దది కావడంతో ప్రణీత్ హనుమంతు సారీ చెబుతూ వీడియో చేశాడు. కానీ.. సారీ చెబితే సరిపోతుందా అంటూ నెటిజన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే పోలీసులు ప్రణీత్ హనుమంతుతో పాటు వీడియోలో ఉన్న అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.

Next Story