భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తాం: రామ్మోహన్ నాయుడు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్‌ నాయుడు బాధ్యతలు స్వీకరించారు.

By Srikanth Gundamalla  Published on  13 Jun 2024 4:01 PM IST
delhi, central minister rammohan naidu, comments ,

 భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తాం: రామ్మోహన్ నాయుడు

ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ భవన్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్‌ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మాట్లాడుతూ.. పలు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కాగా.. కేంద్ర మంత్రి బాధ్యతలు తీసుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు రామ్మోహన్‌ నాయుడు.

తనపై నమ్మకం ఉంచి తనకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాక బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు రామ్మోహన్ నాయుడు. కేంద్ర కేబినెట్‌లోనే తాను అత్యంత పిన్న వయస్కుడిని అనీ.. అయినే నమ్మకం ఉంచినందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రధానికి యువతపై ఉన్న నమ్మకం దీని ద్వారానే అర్థం అవుతోందని చెప్పారు. 100 రోజుల ప్రణాళిక తయారు చేసి.. దాన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు. టెక్నాలజీ వినియోగంతో పౌరవిమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు మరింత కృషిని అందిస్తానని చెప్పారు. సామాన్య ప్రయాణికుల కోసం ఈజ్‌ ఆఫ్‌ ఫ్లయింగ్‌పై దృష్టి పెడతామన్నారు. అలాగే ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు.

భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన అన్నారు. విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అదే సమయంలో పర్యావరణ హితంగా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలి అనేది చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని తెలిపారు. గత పథకాలను కొనసాగిస్తూ మరిన్ని పథకాలను తీసుకొస్తామని చెప్పారు. విజనరీ నాయకులు మోదీ.. చంద్రబాబు నుంచి చాలా నేర్చుకోవచ్చని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.

Next Story