దీప్తి సునైనాకు యాక్సిడెంట్‌..! ఆమె ఏం చెప్పిందంటే..

దీప్తి సునైనా కారుకి యాక్సిడెంట్‌ జరిగిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రచారంపై ఆమె స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  10 Sep 2023 3:53 AM GMT
Deepthi Sunaina, Accident, Social Media,

దీప్తి సునైనాకు యాక్సిడెంట్‌..! ఆమె ఏం చెప్పిందంటే.. 

దీప్తి సునైనా పేరు పరిచయం అక్కర్లేదు. సోషల్‌ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది. యూట్యూబ్ ద్వారా ఫన్నీ వీడియోలు, షార్ట్‌ ఫిలింస్‌లో నటించి మంచి పేరుతెచ్చుకున్న తెలుగు ముద్దుగుమ్మల్లో ఈమె ఒకరు. ఆ తర్వాత బిగ్ బాస్ 2 తెలుగు సీజన్‍లో ఎంట్రీ ఇచ్చి మరో తరహాలో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సీజన్‍లో ఆటలు, పాటలు, గొడవలు పడుతూనే గ్లామర్ ట్రీట్ అందించి ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఆమె కారుకి యాక్సిడెంట్‌ జరిగిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో.. తాజాగా ఈ ప్రచారంపై స్వయంగా దీప్తి సునైనే స్పందించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో దీప్తి సునైనా ఆస్క్‌ మీ సెషన్‌ నిర్వహించింది. మీకు యాక్సిడెంట్‌ అయ్యిందని న్యూస్ వస్తుందని.. నిజమేనా అని ఒక నెటిజన్ అడిగారు. దానికి దీప్తి సునైనా సమాధానం ఇచ్చింది. యాక్సిడెంట్ గురించి చెబుతూ ఇన్‌స్టా స్టోరీ వీడియోలో చెప్పుకొచ్చింది. "గాయ్స్.. ఒక వీడియో చూసి నాకు యాక్సిడెంట్ అయినట్లు ఆ న్యూస్ అలా పెట్టారు. నేను కూడా ఆ వీడియో చూశాను. నాకు కూడా చాలా మంది ఆ వీడియో పంపించారు. 6, 7 ఏళ్ల క్రితం అలియా ఖాన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ నేను చేశాను. నాకు యాక్సిడెంట్‌ జరిగిందని ప్రచారం చేస్తున్న వీడియో ఆ షార్ట్‌ఫిలింలోనిదే. నాకు యాక్సిడెంట్ కాలేదు.. నేను చాలా బాగున్నాను. ఆల్‌ గుడ్. కానీ.. అసలు ఏదీ తెలియకుండా న్యూస్ ఎలా ప్రచారం చేస్తారో అర్థం కావడం లేదని పేర్కొంది దీప్తి సునైనా. తాజాగా ఆమె స్పందించడంతో యాక్సిడెంట్ కాలేదని క్లారిటీ వచ్చింది.

బిగ్‌బాస్‌ తర్వాత బయటకు వచ్చిన దీప్తి సునైనా సినిమాలు ఏవీ చేయలేదు. కానీ ఆమె క్రేజ్‌ మాత్రం అలాగే కొనసాగిస్తూ వస్తోంది. షార్ట్‌ ఫిలింస్, వెబ్‌ సిరీస్‌లతో పాటు మ్యూజిక్‌ ఆల్‌బమ్స్‌ చేస్తూ వస్తోంది. అభిమానులను అలరిస్తోంది. ఇక మరో యూట్యూబర్‌ షణ్ముక్‌ జశ్వంత్‌తో ప్రేమాయనం నడిపిన దీప్తి.. బిగ్‌బాస్‌ సీజన్-5 తర్వాత బ్రేకప్ చేసుకున్న విషయం తెలిసిందే.

Next Story