భారత్ లో 5-12 ఏళ్ల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు

By -  Nellutla Kavitha |  Published on  21 April 2022 1:25 PM GMT
భారత్ లో 5-12 ఏళ్ల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు

దేశంలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. భారతదేశంలో కరోనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా వ్యాక్సిన్ ల మీద దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కరోన వ్యాక్సిన్లను అందిస్తున్న ప్రభుత్వం, ప్రస్తుతం 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు కూడా వ్యాక్సిన్లను ఇవ్వాలని నిర్ణయించుకుంది. దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఎక్స్పర్ట్ కమిటీ కీలక సమావేశం జరిగింది.

5 నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి అనుమతులపై ఈ కమిటీ చర్చించింది. బయోలాజికల్ ఈ రూపొందిస్తున్న కోర్బె వాక్స్ ను 5 నుంచి 12 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు ఇవ్వాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సులను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపించింది. డి జి సి ఐ సిఫార్సు తో త్వరలోనే చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మెల్లి మెల్లిగా పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివిధ రాష్ట్రాలకు లేఖలు కూడా రాసింది. ఈనేపధ్యంలోనే ఢిల్లీ, పంజాబ్ తో పాటుగా మరికొన్ని రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం మీద ఆంక్షలు కూడా విధిస్తున్నాయి.

Next Story