సైబర్‌ క్రైం పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. ఎందుకంటే..

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  25 Feb 2024 7:42 AM GMT
congress, sharmila, complaint,  cyber crime police, ycp ,

 సైబర్‌ క్రైం పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. ఎందుకంటే.. 

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించాయి. ఇక అధికారపార్టీ వైసీపీ కూడా ఎన్నికలకు రెడీ అవుతోంది. గెలిచే వారినే బరిలో నిలపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాద్యతలు తీసుకున్న తర్వాత పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో రాజకీయ పార్టీలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత, గత ప్రభుత్వాలు రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయయంటూ ఆరోపణలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే షర్మిలపై కూడా ఆయా పార్టీల నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో షర్మిలపై వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు తనపై సోషల్ మీడియాలోదుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ షర్మిల సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత కొద్దిరోజులకే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచే యూట్యూబ్ చానెల్స్, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని పోలీసులకు షర్మిల 8 మంది పై కంప్లైంట్ చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాల వివరాలను షర్మిల పోలీసులకు అందించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ఏపీలో జరగనున్న ఎన్నికలకు పొత్తులపై స్పందించారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని చెప్పారు. వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్న వెల్లడించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రెండు ప్రాంతీయ పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయనీ.. టీడీపీ, వైసీపీలపై ఆమె విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. ఇలాంటి దుష్ట శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులో చేతులు కలిపిందని వైఎస్ షర్మిల అన్నారు.

Next Story