దేశానికి కావాల్సింది డెవలపెమెంట్ ఫైల్స్

By -  Nellutla Kavitha |  Published on  21 March 2022 9:45 AM GMT
దేశానికి కావాల్సింది డెవలపెమెంట్ ఫైల్స్

దేశ వ్యాప్తంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై పెద్ద చర్చ సాగుతోంది. దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ సినిమాలో కాశ్మీరీ పండిట్ల వెతలు వివరించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాపై ప్రశంసలతో పాటు గా విమర్శలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ ఎల్పీ భేటీ జరిగింది. ఇందులో కశ్మీర్ ఫైల్స్ సినిమాపై మండిపడ్డారు కేసీఆర్. దేశంలో ఉన్న ప్రస్తుత సమస్యను పక్కదారి పట్టించడానికే ఈ సినిమా విడుదల చేశారని, దేశానికి కావాల్సింది కాశ్మీర్ ఫైల్స్, కాదని డెవలప్మెంట్ ఫైల్స్ అని సూచించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కాశ్మీర్లో హిందూ పండిట్లను చంపినప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. రైతుల సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఈ సినిమాను తెరపైకి తెచ్చారని అన్నారు కేసీఆర్. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణభవన్లో జరుగుతోంది.

ఇందులో పంజాబ్ తరహాలో తెలంగాణలో రైతు ఉద్యమానికి సీఎం కేసీఆర్ సమాచారం వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఉద్యమించేందుకు ఆయన పిలుపునిచ్చారు. రైతుల హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని, గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఆందోళనలు నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వరితో పాటుగా ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

Next Story