ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు, నితీశే కింగ్‌మేకర్స్

టీడీపీ ఏపీలో విజయదుందుభి మోగించింది.

By Srikanth Gundamalla  Published on  5 Jun 2024 1:58 AM GMT
Chandrababu, nitish kumar, key role,  nda govt formation ,

 ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు, నితీశే కింగ్‌మేకర్స్

టీడీపీ ఏపీలో విజయదుందుభి మోగించింది. 135 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. 16 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు కింగ్‌ మేకర్‌గా మారింది టీడీపీ. చంద్రబాబుతో పాటు బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ నాయతకవ్ంలోని జేడీయూ కూడా అక్కడ 12 స్థానాల్లో విజయం సాధించి ఎన్డీఏ సర్కార్‌ ఏర్పాటులో కీలకం కానుంది. ఇప్పుడు చంద్రబాబు, నితీశ్‌లే టాక్‌ఆఫ్‌ది పాలిటిక్స్‌ అయ్యారు. కింగ్‌మేకర్స్‌గా మారారు.

కొద్ది నెలల క్రితం చంద్రబాబు, నితీశ్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. భవిష్యత్‌లో వారు దేశ రాజకీయాలను కూడా శాసిస్తారని ఊహించలేదు. కానీ.. ఏకంగా ఇప్పుడు దేశాన్ని ఏలే ప్రధానిని నిర్ణయించే కింగ్‌ మేకర్లుగా అవతరించారు. 8 నెలల క్రితం చంద్రబాబు అవినీతి ఆరోపణలతో జైలు కు వెళ్తే.. కూటముల మార్పిడితో నితీశ్ కుమార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. దాంతో.. వీరిద్దరూ ఇక ఏం చేస్తారులే అన్న వాదనలు కూడా వినిపించాయి. కానీ.. సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయానికి సమీకరణాలను మొత్తం మార్చుకున్నారు. ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకున్నారు.

తాజా సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. బీజేపీ సొంతంగా 241 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక కమలం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్‌ ఫిగర్‌కు 31 స్థానాల దూరంలో ఉండిపోయింది. దాంతో ఎన్డీఏకు ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి పక్షాల మద్దతు అవసరం అయ్యింది. అందే సమయంలో ఇండియా కూటమి ఒత్తం 233 స్థానాల్లో గెలుపొందింది. ఈ కూటమికి 39 స్థానాలు కావాల్సి ఉంది. దాంతో.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయం ఆసక్తికరంగా మారింది.

ఏపీలో టీడీపీ 16 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ పార్టీ మిత్రపక్షం అయిన జనసేన రెండుచోట్ల విజయం సాధించింది. ఇక బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూ 12 స్థానాలో గెలిచింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత ఈ రెండే పెద్ద పార్టీలు కావడం విశేషం. బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ దక్కలేదు. దాంతో నితీశ్‌ కుమార్, చంద్రబాబు మద్దతు కీలకంగా మారింది.

Next Story