ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
By - Nellutla Kavitha |
ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం లోని మూడు లోక్సభ స్థానాలు, సహా ఏడు అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల అంటే జూన్ ఆరవ తేదీన నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి తేదీ. అదే నెల అంటే జూన్ 23న ఎన్నికలు జరుగుతాయి. ఇక జూన్ 26న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
పార్లమెంటు సభ్యులైన సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్ నుంచి, రాంపూర్ నుంచి ఆజంఖాన్ రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన భగవంత్ మాన్, పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్ నియోజకవర్గం పార్లమెంటు స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మకూర్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో అక్కడ కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. దీంతోపాటుగా ఢిల్లీ, జార్ఖండ్, అగర్తల, త్రిపుర సహా మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.