ఈడీ సమన్లను రద్దు చేయాలన్న కవిత పిటిషన్‌ మళ్లీ వాయిదా

లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  28 Feb 2024 11:44 AM GMT
brs, mlc kavitha, petition, liquor case, supreme court,

ఈడీ సమన్లను రద్దు చేయాలన్న కవిత పిటిషన్‌ మళ్లీ వాయిదా

లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ అధికారులకు ఆమెకు జారీచేసిన సమన్లను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. సుప్రీంకోర్టులో బుధవారం కవిత పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. కానీ.. తగినంత సమయం లేకపోవడంతో మరో తేదీన కవిత పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు పిటిషన్‌ను మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ సమనలను రద్దు చేయాలని.. తనని అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కవిత పేర్కొంది. కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌ ధర్మాసనం విచారించింది. తగినంత టైమ్‌ లేకపోవడంతో మార్చి 13న విచారిస్తామని తెలిపింది. కిందటి ఏడాది కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన నోటీసులు ఇతరులతో కలిపి విచారిస్తామనీ చెప్పారనీ.. కానీ అలా చేయడం లేదని కవిత పిటిషన్‌లో తెలిపింది.

ఇక ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్‌ ఫోన్లను కూడా సీజ్ చేశారని కోర్టుకు వివరించింది ఎమ్మెల్సీ కవిత, సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఒక మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉంటుంది. కానీ.. ఈడీ ఆఫీస్‌కు పిలవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది కవిత. సుప్రీంకోర్టు కూడా పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. గతేడాది నుంచి పలుమార్లు వాయిదా పడుతూనే వస్తోంది.

Next Story