రెండు కోట్ల మంది 'బిగ్ బాస్కెట్' వినియోగదారుల డేటా లీక్.. అమ్మకానికి రెడీ
BigBasket data of over 2 crore users leaked. మరో అతి పెద్ద డేటా లీక్ ఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్కెట్ కంపెనీ
By Medi Samrat Published on
9 Nov 2020 12:38 PM GMT

మరో అతి పెద్ద డేటా లీక్ ఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్కెట్ కంపెనీకి చెందిన రెండు కోట్ల మందికి పైగా యూజర్ల వ్యక్తిగత డేటా హ్యాకింగ్‌కు గురైంది. ఇంతకు ముందే వార్తలు రాగా ఈ విషయాన్ని స్వయంగా బిగ్‌బాస్కెట్ ధృవీకరించడంతో షాక్ తిన్నారు వినియోగదారులు. తమ కంపెనీ పై హ్యకర్లు దాడి చేశారని బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తమ సంస్థకు చెందిన 2 కోట్లకు పైగా ఖాతాదారుల డేటా చోరీకి గురైందని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా హ్యాకర్లు ఈ డేటాను రూ. 30 లక్షలకు డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారు.
2కోట్ల మందికి చెందిన 15 జీబీ డేటాను హ్యాకర్లు దొంగిలించడం జరిగిందని చెబుతున్నారు. ఇందులో వినియోగదారుల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, పాస్‌వర్డ్, కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్, అడ్రస్, పుట్టినతేదీ, లొకేషన్, ఐపీ అడ్రస్ వంటి కీలక సమాచారం ఉన్నాయి. కానీ క్రెడిట్ కార్డ్, ఇతర ఫైనాన్షియల్ వివరాలు క్షేమంగానే ఉంటాయని కంపెనీ చెబుతోంది. డేటా హ్యాకింగ్‌ను కొన్ని రోజుల కిందటే గుర్తించామనీ, ఏ స్థాయిలో డేటా చౌర్యం జరిగిందో తెలుసుకుంటున్నామని కంపెనీ చెబుతోంది.
Next Story