కేఏ పాల్ పై దాడి

By Nellutla Kavitha  Published on  2 May 2022 7:12 PM IST
కేఏ పాల్ పై దాడి

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై సిద్దిపేట జిల్లా జక్కాపూర్ లో దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి కేఏ పాల్ వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కేఏ పాల్‌ వస్తున్నారనే సమాచారంతో జిల్లా సరిహద్దుకి చేరుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, జిల్లా సరిహద్దులోని సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద ఆయన్ని అడ్డుకున్నారు. అక్కడే కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతున్నపుడే, పోలీసులు పక్కనే ఉన్నా అనిల్ కుమార్ అనే వ్యక్తి వచ్చి పాల్‌ చెంపపై కొట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పాల్ అనుచరులు ఆ వ్యక్తిని అడ్డుకుంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే తానే కేఏ పాల్ ని కొట్టానని, సీయం, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకే దాడి చేశానన్నడు అనిల్ కుమార్. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దాడి చేస్తానంటున్నాడు అనిల్. ఇక వద్దంటున్నా, అనుమతులు లేకున్నా కేఏ పాల్ పర్యటనకు వచ్చారంటున్నారు పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాల్ ను తిరిగి హైదరాబాద్ కు పంపించారు పోలీసులు.

Next Story