ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్.. ఎందుకంటే.

ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్‌ కాల్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  27 Aug 2024 2:30 AM
america president, biden, phone call,  pm modi,

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్.. ఎందుకంటే. 

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అంతకుముందు రష్యాకు కూడా వెళ్లి వచ్చారు. అయితే..తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్‌ కాల్ చేశారు. సోమవారం ఇద్దరు దేశాధినేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీఎం మోదీ చారిత్రాత్మక పర్యటన చేశారు. ఇరు దేశాధినేతలను కలిశారు. ఈ క్రమంలోనే మోదీకి బైడెన్ ఫోన్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా బైడెన్ ఫోన్ చేసిన విషయాన్ని వెల్లడించారు.

ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా..ఫోన్‌లో అమెరికా అధ్యక్షుడుబైడెన్‌తో మాట్లాడాను. ఉక్రెయిన్‌లో పరిస్థితితో పాటు వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ సవాల్లప వివరణాత్మక అభిప్రాయాలను పంచుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. శాంతి, స్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బైడెన్‌తో చెప్పినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. అలాగే.. గత కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. అక్కడి పరిస్థితులపైనా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ మధ్య చర్చ జరిగింది. బంగ్లాదేవ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల భద్రతపై తాము చర్చించామని మోదీ చెప్పారు. బంగ్లాదేశ్‌లో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాల్సిన అవసరం ఉందనీ ఈ మేరకు ఇరు దేశాధినేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.



Next Story