ఒక్కటైన ఆలియా - రణ్ బీర్, ఫోటోలు విడుదల చేసిన ఆలియా

By -  Nellutla Kavitha |  Published on  14 April 2022 2:34 PM GMT
ఒక్కటైన ఆలియా - రణ్ బీర్, ఫోటోలు విడుదల చేసిన ఆలియా

బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఎక్కటయ్యారు. తమ పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రాం వేదికగా పోస్ట్ చేసింది ఆలియా. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఇది అంటూ ఎమోషనల్ మెసేజ్ షేర్ చేసీందీ బ్యూటీ. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ బాలీవుడ్ జంట భార్యాభర్తలుగా ఈరోజు తమ కొత్త జీవితం ప్రారంభించారు.

గతకొంతకాలంగా వీరి పెళ్లి ఏర్పాట్ల వార్తలు బాలీవుడ్ తో పాటు అభిమానుల్లోను ఆసక్తి రేపాయి. ఏర్పాట్ల వార్తలు జోరుగా హల్‌చల్ చేస్తూ వచ్చాయి. ఏప్రిల్ 14న వీరు ఒక్కటవబోతున్నారని తెలిసినప్పటి నుండి మీడియా పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను కవర్ చేస్తూ వస్తోంది. అయితే పూర్తిగా ప్రైవేటు వ్యవహారంగా, కేవలం లిమిటెడ్ అతిథులు సమక్షంలో వీరి వివాహం పంజాబీ సంప్రదాయంలో జరిగింది. అయిదేళ్ళుగా తమ ఫ్రెండ్ ఫిప్ కు వేదికయిన బాల్కనీలోనే పెళ్లి జరిగినట్టుగా ఆలియా ప్రకటించింది.

రణ్‌బీర్, ఆలియా వివాహ ముహూర్తానికి రెండు కుటుంబాల సభ్యులు బాంద్రాలోని వాస్తు రెసిడెన్స్‌కు చేరుకున్నారు. వీరి వివాహానికి కపూర్ ఫ్యామిలీ, భట్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పంజాబీ ఆచారం ప్రకారం రణ్‌బీర్ - ఆలియాల వివాహం జరిగింది. అయితే వీరి వివాహాన్ని కవర్ చేయడానికి దాదాపు 200 మంది మీడియా ప్రతినిధులు తమ ఇంటి చుట్టుపక్కల మోహరించి ఉన్నారని, దీంతో తమ ప్రైవసీకి భంగం కలిగిందంటూ పోలీసులను ఆశ్రయించారు నైబర్స్.

Next Story