కొత్త లుక్‌లో ఎయిరిండియా విమానాలు.. మీరు చూశారా..?

ఎయిరిండియా విమానాలను టాటా సన్స్‌ ఆధీనంలోకి తీసుకున్నాక కొత్త రూపులోకి తీసుకొస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  7 Oct 2023 6:12 AM GMT
Air India, flights, New look, Tata group,

కొత్త లుక్‌లో ఎయిరిండియా విమానాలు.. మీరు చూశారా..?

ఎయిరిండియా విమానాలను టాటా సన్స్‌ ఆధీనంలోకి తీసుకున్నాక కొత్త రూపులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోని ఎయిరిండియా లోగో తో పాటు విమానాల రూపురేఖల్లో కొద్దిగా మార్పులకు శ్రీకారం చుట్టారు. ఎయిరిండియా విమానయాన సంస్థ అభివృద్ధిలో భాగంగానే మార్పులు చేస్తున్నట్లు టాటా గ్రూప్‌ చెబుతోంది. అయితే.. ఎయిరిండియా విమానంలో మార్పులు చేసిన తర్వాత నయా లుక్‌కు సంబంధించిన ఫొటోలను టాటా గ్రూప్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

టాటా గ్రూప్‌ ఎయిరిండియా లోగో (logo), ఎయిర్‌క్రాఫ్ట్‌ లివరీలో మార్పులు చేసింది. ఫ్రాన్స్‌లోని టౌలోసి వర్క్‌షాపులో కొత్త లోగో, డిజైన్‌తో తీర్చిదిద్దిన ఏ350 విమానం ఫొటోలను ఎయిరిండియా తన ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో షేర్‌ చేసింది. ఈ చలికాలానికి ఏ350 విమానాలను భారత్‌కు తీసుకొస్తున్నట్లు ఎయిరిండియా విమానయాన సంస్థ తెలిపింది. కాగా.. కొత్త లుక్‌లో ఉన్న ఎయిరిండియా విమానాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ద విస్టాగా వ్యవహరించే కొత్త లోగోలో పసిడి వన్నె మహారాజా మస్కట్ విండో ఫ్రేమ్‌ను ఉంచారు. లోగోలో ఎయిరిండియా అక్షరాల రూపురేఖలను కూడా మార్చారు.

తమ పాత విమానాలన్నింటినీ కూడా ఈ కొత్త డిజైన్‌లోకి మార్చనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఇందుకోసం 400 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్‌ నాటికి కొత్త లోగోతో ఉన్న కొన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఎయిరిండియా సంస్థ చెప్పింది. ఇక 2025 నాటికి ఎయిరిండియాలోని అన్ని విమానాలకు కొత్త లోగోను అమర్చనున్నట్లు ప్రకటించింది.

Next Story