రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకుంటానన్న నటి.. కానీ ఒక్క కండీషన్..!
నటి షెర్లిన్ చోప్రా సంచలన కామెంట్స్ చేసింది. రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానని.. అందులో తప్పేముందని ప్రశ్నించింది.
By Srikanth Gundamalla Published on 6 Aug 2023 5:19 AM GMTరాహుల్‌గాంధీని పెళ్లి చేసుకుంటానన్న నటి.. కానీ ఒక్క కండీషన్..!
బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా చాలా సినిమాలు చేశారు. ఈ మధ్య కాలంలో ఆమె చేసే కామెంట్స్.. ఆమె వ్యవహారం వైరల్ అవుతోంది. నిర్మాతలపై ఆరోపణలు చేయడం.. అంతేకాక ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ పెళ్లిచేసుకోవాలని ఉందని చెప్పడం వరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఓ శృంగార పత్రికకు నగ్నంగా ఫోజులిచ్చి హాట్‌టాపిక్ అయ్యారు. ఇలా సినీ ఇండస్ట్రీలోనే కాకుండా.. తాజాగా షెర్లిన్ చోప్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానూ కాంట్రవర్సీగా మారాయి. దాంతో.. షెర్లిన్ చోప్రా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నట్లు అయ్యింది.
తాజాగా నటి షెర్లిన్ చోప్రా రాహుల్‌గాంధీ గురించి సంచలన కామెంట్స్ చేశారు. మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీకి ఇటీవల సుప్రీంకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. కింది కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఓ చోట మీడియా ప్రతినిధులతో నటి షెర్లిన్ చోప్రా మాట్లాడింది. ఈ క్రమంలోనే కొందరు జర్నలిస్టులు రాహుల్‌గాంధీ గురించి ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి ఆ కేసులో రిలీఫ్ దొరకడంపై షెర్లిన్ చోప్రా హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వెంటనే ఒక జర్నలిస్ట్ రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకుంటారా అని క్వశ్చన్ అడగ్గా.. దానికి ఆమె ఏమాత్రం లేట్ చేయకుండా సంచలన సమాధానం చెప్పింది. హా చేసుకుంటాను అంటూ ఆమె మనసులో మాటను బయటపెట్టింది. రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా.
అంతేకాదు.. రాహుల్‌ను పెళ్లి చేసుకుంటారా అని అడిగి ప్రశ్నకు రిటర్న్‌గా షెర్లిన్ జర్నలిస్ట్‌లను క్వశ్చన్ చేసింది. రాహుల్‌ను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అడిగింది. అందులో తప్పేముంది అంటూ ప్రశ్నించింది. అయితే.. రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకోవడంలో మాత్రం ఒక కండీషన్ పెట్టింది షెర్లిన్. రాహుల్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత తన ఇంటి పేరును మార్చుకోను అని తెలిపింది. పెళ్లి అయ్యాక కూడా తన సర్‌నేమ్ చోప్రాగానే ఉంటుందని చెప్పుకొచ్చింది నటి షెర్లిన్ చోప్రా. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు షెర్లిన్ వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు.