తెలంగాణ‌లో కొత్త‌గా 1,267 క‌రోనా కేసులు

1267 Corona Cases In Telangana. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,267 పాజిటివ్‌ కేసులు నమోదు

By Medi Samrat  Published on  10 Nov 2020 3:19 AM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా 1,267 క‌రోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,267 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, న‌లుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,52,455 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 1385 మంది మృతి చెందారు. ఇక తాజాగా 1,831 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,32,489 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. ఇక రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు 92.09 శాతం ఉండగా, దేశంలో 92.6 శాతం ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం యాక్టివ్‌ కేసులు 18,581 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 15,794 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా అత్యధికంగా పాజిటివ్‌ కేసులు జీహెచ్‌ఎంసీలో 201, మేడ్చల్‌ మల్కాజిగిరి 109, రంగారెడ్డి 104 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాల్లో వంద లోపు కేసులు నమోదయ్యాయి.


Next Story