పంద్రాగస్టు వేళ కేంద్ర, రాష్ట్ర బలగాలకు 1,037 పోలీసు పతకాల ప్రకటన
1,037 మంది పోలీసు సిబ్బందికి ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Aug 2024 3:49 PM ISTపంద్రాగస్టు వేళ కేంద్ర, రాష్ట్ర బలగాలకు 1,037 పోలీసు పతకాల ప్రకటన
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర బలగాలకు చెందిన 1,037 మంది పోలీసు సిబ్బందికి ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది కేంద్రం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 214 మంది సిబ్బందికి శౌర్య పతకాలను అందించనున్నారు. ఇందులో ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (PMG)తో పాటు 231 మెడల్ ఫర్ గ్యాలంట్రీ (GM) ఉన్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి గరిష్టంగా 52 శౌర్య పతకాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులకు 31, ఉత్తరప్రదేశ్ సహా మహారాష్ట్ర నుండి 17 మంది పోలీసు సిబ్బంది, ఛత్తీస్‌గఢ్ నుండి 15, మధ్యప్రదేశ్ నుండి 12 మంది ఈ మెడల్స్‌ను అందుకోనున్నారు.
జూలై 25, 2022న ఇద్దరు కరుడుగట్టిన చైన్ స్నాచర్లు, ఆయుధాల అక్రమ రవాణాదారులను పట్టుకోవడంలో "అరుదైన శౌర్యం" ప్రదర్శించినందుకు తెలంగాణ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు ధైర్యసాహసాలకు అత్యున్నత పోలీసు పతకమైన ఏకైక PMG మెడల్‌ను ప్రకటించారు. ఈ ఘటనలో హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు నేరస్థులు పోలీసులపై దారుణంగా దాడి చేశారు. శరీరంపై పదే పదే పొడిచారు. కానీ.. అతను మాత్రం పట్టు వదలకుండా నిందితులను పట్టుకున్నాడు. ధైర్యవంతుడైన పోలీసు తీవ్రంగా గాయపడి.. 17 రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు ఈ నేపథ్యంలోనే అత్యంత ధైర్యవంతుడిగా పరిగణిస్తూ మెడల్ ఫర్ గ్యాలంట్రీని అందించనున్నారు.
ఇతర పతకాలలో 94 రాష్ట్రపతి పోలీసు పతకం విశిష్ట సేవ మరియు 729 మెరిటోరియస్ సర్వీస్ మెడల్ ఉన్నాయి. ఈ పతకాలను సంవత్సరానికి రెండుసార్లు ప్రకటిస్తారు. మరొకటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. PPMG అలాగే PMG ప్రాణాలను, ఆస్తిని రక్షించడంలో లేదా నేరాలను నిరోధించడం, నేరస్థులను అరెస్టు చేయడంలో ప్రస్ఫుటమైన శౌర్యాన్ని ప్రదర్శించినందుకు ప్రదానం చేస్తారు. పోలీసు సేవలో ప్రతిభావంతమైన సేవ అందించినందుకు విధి పట్ల అంకితభావంతో కూడిన విలువకు రాష్ట్రపతి పోలీసు పతకం అందిస్తారు.