తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు
Budget Allocations For Both Telugu States
By Nellutla Kavitha Published on 1 Feb 2023 4:20 PM IST
కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై భారీ అంచనాలే కనుపించాయి. అయితే కేంద్ర బడ్జెట్ 2023 లో తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆశించిన కేటాయింపులు దక్కలేదు. కానీ పలు సంస్థలకు కాస్త ప్రాధాన్యత దక్కింది. మోదీ సర్కార్ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయింపులు జరపలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41,338 కోట్లు కాగా తెలంగాణ వాటా రూ.21,470 కోట్లుగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ సంస్థలకు కేటాయింపులు
• ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.47 కోట్లు
• పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు
• విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.683 కోట్లు
తెలంగాణ సంస్థలకు కేటాయింపులు
• సింగరేణికి రూ.1,650 కోట్లు
• ఐఐటీ హైదరాబాద్‌కు ఈఏపీ కింద రూ.300 కోట్లు
• మణుగూరు, కోట భారజల కేంద్రాలకు రూ.1,473 కోట్లు
ఉమ్మడి కేటాయింపులు
• మంగళగిరి, బీబీనగర్ ఎయిమ్స్‌తో పాటు దేశంలోని 22 ఎయిమ్స్ ఆస్పత్రులకు రూ.6,835 కోట్లు
• తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలకు రూ.37 కోట్లు
• సాలార్జంగ్ మ్యూజియం సహా అన్ని మ్యూజియాలకు రూ.357 కోట్లు