గంట 26 నిమిషాల పాటు కొనసాగిన బడ్జెట్ ప్రసంగంలో వేతన జీవులకు ఊరట కనిపించింది. పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు ఆర్ధిక శాఖా మంత్రి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటన చేసారు. సంవత్సర ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 శాతం పన్ను విధించనున్నారు. ఇది కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్ పరిమితిని కూడా పెంచారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇప్పటిదాకా 15 లక్షలు ఉన్న పరిమితిని డబుల్ చేసి 30 లక్షలకు చేశారు