నిర్మలమ్మ బడ్జెట్ కేటాయింపులు

Union Budget 2023 - 24

By -  Nellutla Kavitha |  Published on  1 Feb 2023 7:05 AM GMT
నిర్మలమ్మ బడ్జెట్ కేటాయింపులు

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఐదవసారి కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 11 గంటలకు బడ్జెట్ 2023-24 ప్రసంగాన్ని మొదలుపెట్టారు మంత్రి నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ఉందని, 9 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యిందని అన్నారు నిర్మల.

దేశవ్యాప్తంగా 102 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించామని, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు కూడా గుర్తించాయని అన్నారు ఆర్థిక శాఖా మంత్రి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ 2023 - 24 ప్రవేశపెడ్తున్నట్టుగా చెప్పారు. ప్రస్తుత ఏడాదికి వృద్ధి రేటు 7 % గా అంచనావేశారు.

మహిళా సాధికారత దిశగా భారత్ కృషి చేస్తోందని, ఆత్మనిర్భర్ భారత్‌తో చేనేత వర్గానికి లబ్ధి చేకూరిందని, 2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల.

ముఖ్య అంశాలు:

పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు

గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు

ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం

రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు

రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు

ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయింపు

గిరిజన మిషన్‌ కోసం రూ.10వేల కోట్లు

దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణం

చిరువ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి

ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7వేల కోట్లు కేటాయింపు

విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు

Next Story