నిర్మలమ్మ మధ్యతరగతి ప్రజలకు ఊరట గలిగించబోతున్నారా

High Expectations On Budget 2023

By -  Nellutla Kavitha |  Published on  30 Jan 2023 6:14 PM IST
నిర్మలమ్మ మధ్యతరగతి ప్రజలకు ఊరట గలిగించబోతున్నారా

ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై భారీ అంచనాలు, ఆశలే ఉన్నాయి. మోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి సంపూర్ణ బడ్జెట్ ఇదే కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ మరీ మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలగవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇటీవల ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, తను కూడా మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చానని, వారి బాధలు ఏంటో తనకు తెలుసని అన్నారు. ఈ నేపథ్యంలోనే సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఆర్థిక మంత్రి ఇబ్బంది పెట్టక, ఊరట కల్గిస్తూ మెప్పించాల్సి పరిస్థితి ఉంటుంది.

ప్రధానంగా కొత్త ఆదాయపు పన్ను వ్యవస్థపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2014 తరువాత ఆదాయపు పన్ను పరిమితిని తిరిగి కేంద్ర ప్రభుత్వం పెంచకపోవడంతో, ఈసారి బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటన ఉండవచ్చని, పరిమితి పెంచవచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుతం 2.50 లక్షల పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షలకు పెంచే అవకాశం ఉందని భావిస్తున్వారు. 2014 నుంచి ఆదాయపు పన్ను పరిమితి నెలకు 2.50 లక్షల రూపాయలుగా ఉంది.

పాత పన్ను విధానంలో పన్ను శ్లాబులను హేతుబద్ధీకరించాలని, తమకు ఉపశమనం కలిగించాలని మధ్యతరగతి ప్రజల నుంచి మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. ప్రస్తుతం 2.50 లక్షల నుండి 7.50 లక్షల ఆదాయంపై 10 % ఉన్న పన్నును ఈసారి బడ్జెట్‌లో 5 % పన్నుకు తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ఇక ఇప్పటివరకు 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తిగత ట్యాక్స్ పేయర్ల ఆదాయంపై 5 శాతం ట్యాక్స్, 5 - 10 లక్షల ఆదాయంపై 20 శాతం ట్యాక్స్, 10 లక్షల పైబడి ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. వేతన జీవులకు ఇన్‌కంటాక్స్ పరిమితిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్ లో పెంచవచ్చని అంచనాలు ఉన్నాయి.

మరోవైపు సామాన్య, మధ్య తరగతి ప్రజలు భయపడేంతగా ప్రస్తుతం దూసుకెళ్తున్నాయి బంగారం ధరలు, పసిడి ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆకాశాన్నంటిన ధరతో ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ముడి చమురు ధరలకు తోడు, జూలై 2022లో ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 15%కి పెంచడం దీనికి కారణంగా మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. కొనుగోళ్లు పెరగాలంటే దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు బంగారం వ్యాపారులు.

Next Story