హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలకే ప్రత్యేకం ఖైరతాబాద్ గణపతి. భారీ కాయంతో, విభిన్న రూపంతో ప్రతీ ఏటా ఆకర్షిసుంటాడు ఆ గణపయ్య. ఈ సంవత్సరం పంచముఖ మహా లక్ష్మీ గణపతి గా దర్శనం ఇవ్వనున్నాడు ఖైరతాబాద్ మహా గణపతి. ఈ సంవత్సరం 50 అడుగుల ఎత్తులో మట్టి తో గణేశుడ్ని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ఈ ఏడాది దర్శనమిచ్చే గణపతికి ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహా గాయత్రి దేవి,కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యం స్వామి ఉండబోతున్నారు. మొట్ట మొదటి సారి మట్టి తో తయ్యారు అవుతున్న ఖైరతాబాద్ గణేషుడు. ఈ జూన్ 10 న కర్రపూజతో మొదలైయ్యాయి విగ్రహ తయారీ పనులు. నిమజ్జనానికి తరలివెళ్లేలా మట్టి విగ్రహాన్ని తయారీ చేస్తున్నట్టుగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ నిర్వాహకులు ప్రకటించారు.