రేప‌టి నుంచి రాష్ట్రంలో రోడ్లపై ప‌రుగులు పెట్ట‌నున్న బ‌స్సులు..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2020 7:10 AM GMT
రేప‌టి నుంచి రాష్ట్రంలో రోడ్లపై ప‌రుగులు పెట్ట‌నున్న బ‌స్సులు..!

దాదాపు రెండు నెల‌ల త‌రువాత రాష్ట్రంలో ఆర్టీసీ బ‌స్సులు రోడెక్క‌నున్నాయి. మంగ‌ళ‌వారం నుంచి బ‌స్సులు రోడ్ల‌పై ప‌రుగులు పెట్ట‌నున్నాయి. సాయంత్రం ఐదుగంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంత్రి మండ‌లి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో ఆర్టీసీ బ‌స్సుల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంతో పాటు లాక్‌డౌన్ విష‌యంలో అనుస‌రించాల్సిన వ్యూహంపై బేటిలో చ‌ర్చింనున్నారు. రాష్ట్రంలో స‌మ‌గ్ర వ్య‌వ‌సాయ విధానంలో భాగంగా నియంత్రిత ప‌ద్ద‌తిలో పంట‌ల సాగు విధివిధానాల‌పైనా చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే 50 శాతం బ‌స్సుల‌ను న‌డిపేందుకు కేంద్ర అనుమ‌తులున్నా క‌రోనా వ్యాపిస్తుంద‌నే అనుమానుంతో ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు బ‌స్సుల‌ను న‌డ‌ప‌లేదు. రాష్ట్రంలో ఆరెంజ్‌, గ్రీన్ల జోన్ల సంఖ్య పెర‌గ‌డంతో బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని బావిస్తోంది. ఆర్టీసీకి వ‌ర్గాల‌కు దీనిపై ఆదివారం రాత్రి స‌మాచార‌మిచ్చింది. సోమ‌వారం ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ అధ్య‌క్ష‌త‌న ఆర్టీసీ అధికారుల ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. బ‌స్సుల ఎలా న‌డ‌పాలి.. ఎయో మార్గాల్లో న‌డపాలి.. బ‌స్సులో ఎంత మంది ప్ర‌యాణీకుల‌ను అనుమ‌తించాల‌నే విష‌యాల‌ను చ‌ర్చించి అందుకు త‌గిన ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేసి సాయంత్రం మంత్రిమండ‌లి స‌మావేశంలో నివేదిస్తార‌ని తెలిసింది.

కంటోన్‌మెంట్ జోన్లు మిన‌హా గ్రామీణ జిల్లా, రాజ‌ధానికి బ‌స్సులు న‌డిచే అవ‌కాశం ఉంది. వ్య‌క్తిగ‌త దూరం పాటించ‌డం వంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఇత‌ర రాష్ట్రాల‌కు న‌డిచే బ‌స్సు స‌ర్వీసుల‌పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఇరు రాష్ట్రాల అంగీకారంతో బ‌స్సు స‌ర్వీసులు ఏర్పాటు చేసుకోవ‌చ్చున‌ని కేంద్రం సూచించిన సంగ‌తి తెలిసిందే. ఆయా రాష్ట్రాల ప‌రిస్థితులు, స‌మ‌న్వ‌యం ఇత‌ర అంశాల ఆధారంగా త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకునే వీలుంది. గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఏరియా మిన‌హా మిగిలిన ఏ జిల్లాలో కూడా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం లేదు. ఇంత‌క‌ముందు మీడియా స‌మావేశంలో అన్ని జిల్లాలు గ్రీన్ జోన్ల‌లోకి వ‌చ్చాకే బ‌స్సులు న‌డుపుతామ‌ని కేసీఆర్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. మ‌రీ సాయంత్రం జ‌రిగే మంత్రి మండ‌లి స‌మావేశంలో కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకుంటారో అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story