సూర్యాపేట: హుజూర్‌గనర్‌ ఉప ఎన్నికకు సిబ్బంది సర్వం సిద్ధం చేస్తున్నారు. ఏడు మండలాల్లో 302 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోన్నారు. పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను సిబ్బంది పూర్తి చేస్తున్నారు. ఇంటింటికి ఓటర్‌ స్లిప్‌లను పంపిణీ చేశారు. ప్రచార గడువు ముగియడంతో పార్టీ జెండాలను ప్రదర్శించవద్దని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఎన్నిక నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 79 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. నియోజకవర్గ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. బరిలో 28 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య ఉంది. మరీ హుజూర్‌నగర్‌ ప్రజలు ఎవరికి జై కొడుతారో చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.