త‌న బాధ‌ను బ‌య‌ట‌పెట్టిన డైరెక్ట‌ర్ బాబీ

By Newsmeter.Network  Published on  5 Dec 2019 6:09 AM GMT
త‌న బాధ‌ను బ‌య‌ట‌పెట్టిన డైరెక్ట‌ర్ బాబీ

వెంక‌టేష్ - చైత‌న్య క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ‌. ఈ సినిమాని జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ తెర‌కెక్కించారు. ఈ నెల 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే... ఈ క్రేజీ మూవీ రిలీజ్ చేయ‌డంలోనే కాదండోయ్ షూటింగ్ స్టార్ట్ చేయ‌డంలో కూడా బాగా లేట్ అయ్యింది. దీనికి కార‌ణం.. సురేష్ బాబు ఈ క‌థ‌కి మార్పులు చేర్పులు అలా చెబుతూనే ఉండ‌డ‌మే. ఒకానొక ద‌శ‌లో ఇక నేను ఈ మూవీని డైరెక్ట్ చేయ‌ను అని బాబీ చెప్పేసాడు అని టాక్ వచ్చింది.

ఇదిలా ఉంటే... ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో డైరెక్ట‌ర్ బాబీ మాట్లాడుతూ.. మామ‌, అల్లుడు మ‌ధ్య రిలేష‌న్‌తో సినిమా చేద్దామ‌ని కోన గారు చెప్ప‌గానే.. విన్నాను. వెంట‌నే న‌చ్చింది. ఈ క‌థ‌ను నిజ జీవితంలో ఒకే కుటుంబానికి చెందిన మామ అల్లుడు క‌లిసి చేస్తే బాగుంటుంది అనిపించింది. అలాగే వెంక‌టేష్ గారు, చైత‌న్య ఇందులో న‌టిస్తున్నార‌ని తెలిసి చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. త‌ర్వాత సురేష్ గారిని క‌లిసి నెరేష‌న్ ఇచ్చాను.

ఎఫ్‌2, మ‌జిలీ కంటే ముందు స్టార్ట్ కావాల్సిన ప్రాజెక్ట్.. ఉగాది ప‌చ్చ‌డిలో చేదు, పులుపు, కారం ఇలా ఆరు రుచులుండినా చివ‌రికి ఉగాది ప‌చ్చ‌డి బావుంటుంది. అలాంటి ఉగాది ప‌చ్చ‌డిలాంటి వ్య‌క్తి సురేష్‌బాబు గారు. ఆయ‌న క‌థ ఒకే అని ఈ రోజు చెబుతారు. మ‌ర్నాడు మ‌ళ్లీ క‌థ‌లో ఏదో డౌట్ అడుగుతారు. ఇలా ఆయ‌న అడిగిన డౌట్ ల‌కు స‌మాధానాలు చెప్పాను కానీ.. ఒకానొక టైమ్ లో ఏంటి సార్ ఇది నిన్న ఓకే అన్నారు నేడు మ‌ళ్లీ డౌట్ అంటున్నారు అనేవాడిని అయితే.. ఆయ‌న‌ అడిగిన దానికి ఓ లాజిక్ ఉంటుంది అన్నాడు. ఈ విధంగా సురేష్ బాబు ద‌గ్గ‌ర త‌ను ఎంత‌ బాధ పడ్డాడో బ‌య‌ట‌పెట్టాడు బాబీ.

Next Story
Share it